సిల్క్ స్మిత పాత్రకు రెడీ అంటున్నశృంగార తార!
బాడీ షేపులు బాగా పెంచి హీరోయిన్ నుంచి శృంగార తారగా, ఐటం గర్ల్‌గా మారిన నమిత ఇప్పుడు సిల్క్ స్మిత పాత్రపై కన్నేసింది. బాలీవుడ్లో విద్యాబాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' దక్షిణాదిన రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ చిత్రంలో అవకాశం దక్కించుకోవడానికి ట్రై చేస్తోంది.
సిల్క్‌స్మిత పాత్రని తమిళంలో పోషించడానికి చాలా మంది తారలు పోటీపడుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో నయనతార ప్రధాన పాత్రలో ఏక్తాకపూర్ రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేసి విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించడానికి నమిత ఆసక్తిని ప్రదర్శిస్తోంది.
ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ 'సిల్క్ పాత్ర కోసం ఎంతమంది పోటీపడినా ఆ పాత్ర నేను చేస్తేనే రక్తికడుతుంది. సిల్క్ పాత్ర తెరపై కనువిందు చెయ్యాలంటే ఆ పాత్రకు నేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అవసరమైతే సిల్క్ పాత్రలో నటించడానికి పారితోషికం తగ్గించుకోవడానికైనా నేను సిద్ధమే' అని ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది నమిత.
మరీ లావెక్కి పోవడంతో నమితకు ఈ మధ్య అవకాశాలు కూడా బాగా తగ్గి పోయాయి. పెద్ద హీరోలు, దర్శకులు అయితే నమితను కనీసం పట్టించుకోవడం కూడా మానేశారు. దీంతో అవకాశాల దక్కడమే మహా భాగ్యంగా ఏ సినిమాలను వదలకుండా ట్రై చేస్తోంది. ప్రస్తుతం కన్నడ, తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో మాత్రమే నమిత నటిస్తోంది.


Click it and Unblock the Notifications











