బాలయ్యతో ఆడ 'సింహం' నమిత!
తన కలలు ఇప్పుడే సాకారమవుతున్నాయని నమిత సంబరపడుతోందట. బాలకృష్ణతో 'సింహ' నటించి లక్స్ పాప కంటే ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకోగలనన్న నమ్మకంతో ఈ భారీ అందాల నటి ఉంది. బాలయ్యతో నటిస్తేనే తన అందాలను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని కూడా ఆమె అనుకుంటున్నట్టుంది. తొలుత టాలీవుడ్‌లోనే అడుగుపెట్టినప్పటికీ, ఈ భామ కెరీర్ ఇక్కడ మలుపు తిరగలేదు. కొన్ని సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమె తమిళ పరిశ్రమలోకి వెళ్లిపోయింది. అక్కడ ఊహించనివిధంగా బిజీఅయిన ఆమెకు కొంతకాలం నుంచి అవకాశాలు సన్నగిల్లాయి.
ఈ నేపథ్యంలో ఆమె టాలీవుడ్‌పై కన్నేసింది. ఈ మధ్య ఏదోఒక చిత్రం ఆమె చేస్తూనేవుంది. ఆమె టైటిల్ పాత్ర పోషించిన 'జగన్మోహిని' చిత్రం నిరాశపరిచింది. 'బిల్లా' తర్వాత ఇప్పుడేమో 'సింహా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ముగ్గరు కథానాయికలలో నమిత కూడా ఓ కథానాయిక. బాలకృష్ణ లాంటి టాప్‌స్టార్ సరసన అవకాశం లభించడం పట్ల నమిత ఎంతో సంతోషాన్ని వ్యక్తంచేస్తోంది. తెలుగులో బాగా బిజీకావాలన్న తన కలలు సాకారమవుతున్నాయని ఆమె అంటోంది.


Click it and Unblock the Notifications











