'సింహా' లో బొద్దుగా కనపడబట్టే...నమిత
'సింహా' చిత్రంలో నేను మరింత అందంగా, రొమాంటిక్‌గా కనిపించానని ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఇలాగే చూడ్డానికి ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకే నేను నడుచుకుంటాను అంటోంది నమిత. విజయ ధుంధుబి మ్రోగిస్తున్న 'సింహా' సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో కనిపించివ నమిత మరింత లావుగా ఉండి కొందరికి ఆనందం మరికొందరికి ఇబ్బంది పెట్టింది. అయితే నమిత మాత్రం ఈ చిత్రం విజయం సాధించడంతో చాలా హ్యాపీగా వుంది. గత కొంత కాలం నుంచి విజయం కోసం ఎదురుచూస్తున్న తనకు ఈ సక్సెస్ ఊరటనిచ్చిది. అయితే ఇటీవల కాస్త బరువు తగ్గినట్లు కనిపించిన నమిత ఈ చిత్రంలో మరింత బొద్దుగా కనిపించారు...ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రసావిస్తే 'నన్ను ప్రేక్షకులు అలా చూడటానికే ఇష్టపడుతున్నారు. భవిష్యత్‌లో మళ్ళీ నన్ను నాజూగ్గా చూడాలనుకుంటే తప్పకుండా మళ్ళీ వర్కవుట్లు చేసి తగ్గుతాను' అంది నమిత. నేను బరువు తగ్గినా పెరిగినా అది పాత్ర డిమాండ్ మేరకే. ప్రేక్షకుల అభిరుచులు భిన్నంగా వుంటాయి. ఇంతకు ముందు తమిళులకు నేను బొద్దుగా వుంటే నచ్చేది. దేశద్రోహి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం బాగా వర్కవుట్ చేశాను. రోజూ యోగా చేశాను. మూడు నెలల్లో దాదాపు ఎనిమిది కిలోల దాకా బరువు తగ్గాను....ఆ పాత్రకి అది అవసరం కాబట్టి చేశాను అంటూ వివరణ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











