నమితది అదీ వార్తే
భారీ అందాల నమిత తాజాగా ఓ ఎనిమిది కేజీల బరువు తగ్గి వార్తల్లో కెక్కింది. పోలీస్ ఆఫీసర్ గా చేయబోతున్న దేశద్రోహి చిత్రం కోసం ఆమె ఇలా తగ్గిందని సమాచారం. ఇక ఇన్నాళ్లూ నేను ఏ మాత్రం బరువు తగ్గను. నాకు బొద్దుగా ఉండటమే ఇష్టం" అంటూ చెప్పుకొచ్చింది. అయితే భిల్లాలో ఆమె వేసిన బికినీ సన్నివేసానికి నెగిటివ్ రెస్పాన్స్ రావటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ఒక పవర్ ఫుల్ పోలీసు కథాంశంతో ఈ చిత్ర కథ ఉంటుందనీ, విజయశాంతితో ఈ కథను తెరకెక్కిద్దామని తొలుత అనుకున్నప్పటికీ చివరకు నమితను ఎంపిక చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ పాత్రకు నమిత చక్కగా సరిపోతుందనీ, ఈ పాత్రకోసం ఇప్పటికే ఆమె 8 కిలోల బరువు తగ్గారనీ వివరించారు. ఈనెల మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, నమిత పోలీసు అధికారిణిగా ఇందులో పవర్ ఫుల్ రోల్ పోషించనుందనీ, ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారనీ దర్శకుడు వివరించారు.
'దేశద్రోహి' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ ప్రముఖ యువ హీరో కూడా నటించనున్నారు. శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై జి.వి.హెచ్.ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రానికి సంబందించిన విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'పోలీస్ వ్యవస్థకు, నక్సలిజంకు మద్య జరిగే పోరాటమే ఈ చిత్ర ప్రదానాంశమన్నారు.
'త్రీ' చిత్రంలో కథానాయకుడిగా నటించిన శాంతిచంద్ర ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రను చేయనున్నారు. పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. హాస్యనటులు బ్రహ్మానందం, వడివేలు పండించే హాస్య సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి' అన్నారు.ఇక నమిత ఒళ్ళు పెంచినా వార్తే తగ్గించినా వార్తే అంటున్నారు తోటి నటీమణలు.


Click it and Unblock the Notifications











