ఆ ఆనందంలో నమిత!
నమిత ప్రధానపాత్రలో నటించిన "జగన్మోహిని"కి హిట్ టాక్ రావడంతో నమిత ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. అసలే భారీ మనిషి, ఆపై ఈ సంతోషంతో ఆమె ఇంకా భారీగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె విలేకరుల సమావేశం పెట్టి తనను ఆదరించిన తెలుగు, తమిళ ప్రేక్షకులకు ధ్యాంక్స్ చెప్పుకుంది.
బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని ఒక తుంటరి విలేకరి ప్రశ్నించగా ఆమె స్పష్టంగా "నో" అని చెప్పింది. తన బలమేమిటో, బలహీనత ఏమిటో ఆమెకు బాగా తెలిసినట్టుంది. నమిత వంటి బొద్దు గుమ్మలను బాలీవుడ్ లో అదరించరని ఆమెకు తెలిసినట్టుంది. అందుకే ఆమె దక్షిణాది సినిమాల్లో తప్ప నటించనని స్పష్టంగా చెప్పింది. నమిత నటించిన కన్నడ, తెలుగు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











