For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది తప్పే!.. అంతా జ్యోతిష్యుడి వల్లే, ప్రభాస్ అందుకే నచ్చాడు..: నమిత

  |

  తమిళనాడులో వ్యక్తి పూజ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. అభిమాన నటీనటులంటే వారికి దైవంతో సమానం. అందుకే కొంతమంది అభిమానులు కుష్బూ లాంటి హీరోయిన్లకు ఏకంగా గుడులే కట్టించారు.

  అలా వర్థమాన కథానాయిక నమిత కూడా ఎప్పుడో ఆ జాబితాలో చేరిపోయారు. ఆమె కోసం గుడి కట్టడమే కాదు.. కిడ్నాప్ చేయడానికి కూడా యత్నించారు. నమిత జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర పరిణామాల గురించి తాజాగా ఆమె ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

  రెండుసార్లు ఆత్మహత్యాయత్నం.. బిల్డింగ్‌పై నుంచి దూకి.. కారణం అదే.. నమిత

  వీరాతో పరిచయం?:

  వీరాతో పరిచయం?:

  నేను నార్త్ అమ్మాయినే అయినా.. మొదటినుంచి చెన్నైలోనే గడిచింది జీవితం. నా ఫ్రెండ్స్ నిక్కీ, శశిధర్‌ బాబు ద్వారా నాకు వీరా పరిచయయయ్యారు. పరిచయమయ్యాక ఆర్నెళ్ల పాటు అంతా మామూలే. ఆ తర్వాతే వీరా నాపై ఇంట్రెస్ట్ చూపించాడు. ఆపై నేనూ ఇష్టపడ్డాను.

  శరత్‌బాబుతో సహజీవనం.. పెదవి విప్పిన నమిత.. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని..

  చిన్నతనంలో సినిమాల గురించి:

  చిన్నతనంలో సినిమాల గురించి:

  నా చిన్నతనంలో సినిమాల్లో పాటలు చూసేప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది. వెంట వెంటనే హీరో హీరోయిన్ల డ్రెస్సులు మారిపోతుంటే.. అర్థమయ్యేది కాదు. పార్కులో పాటలు షూట్ చేస్తున్నప్పుడు.. అసిస్టెంట్‌లు చెట్ల వెనుక వేరే డ్రెస్‌లు పట్టుకొని రెడీగా ఉంటారేమో అనుకునేదాన్ని.

  నమిత 'ఫస్ట్ లవ్':

  నమిత 'ఫస్ట్ లవ్':

  13ఏళ్ల సుదీర్ఘ ప్రేమ కథ అది. కపూర్.. నేను ఆయన్ను అలానే పిలుస్తాను. మా ఇద్దరికీ 2007లో నిశ్చితార్థం కూడా అయింది. 2011లో వివాహం చేసుకుందామనుకున్నాం.

  కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. ఆఖరికి డిసెంబరు 31, 2013న.. 'బ్రేకప్' చెప్పేసుకున్నాం. మా ఇద్దరికీ వర్కౌట్ అవదని నిర్ణయించుకున్నాకే అలా చేశాం.

  'అది నేను చేసిన తప్పు':

  'అది నేను చేసిన తప్పు':

  అందులో భైరవి అని వేశారు. నిజంగా అది నేను చేసిన తప్పు. ఓ జ్యోతిషుడు మీ పేరును భైరవి అని మార్చుకోండి మీ జీవితం బాగుంటుందని చెప్పడంతో అలా చేశాను. కానీ ఆ తర్వాత నా లైఫ్ ఏమాత్రం బాగాలేదు. దీంతో మళ్లీ అసలు పేరునే కొనసాగిస్తూ వస్తున్నా.

  నమితకు ప్రపోజ్ చేసినప్పుడు.. 'హగ్' చేసుకుని మరీ?

  నమితకు ప్రపోజ్ చేసినప్పుడు.. 'హగ్' చేసుకుని మరీ?

  వీరా: అప్పటికే నమితతో చాలా పరిచయం ఉంది. క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నాం. ఆ ధైర్యంతోనే ఆమెను కౌగిలించుకుని ఐలవ్యూ చెప్పేశాను. అప్పటికే ఒక నెల రోజుల నుంచి ఆమెను కలవలేదు. మాట్లాడలేదు. అందుకే చూడగానే అలా చేశా.

  'బిగ్ బాస్'పై:

  'బిగ్ బాస్'పై:


  'బిగ్ బాస్' షోలో నేను మాట్లాడిన మాటల్ని ఎడిట్‌ చేసి ప్రసారం చేశారు. వాళ్లు ఏం చూపించాలనుకునున్నారో అందుకు అనుగుణంగా ఎడిట్ చేసి తప్పుగా చూపించారు. షో నుంచి బయటకొచ్చాక నేనే షాక్ అయ్యాను. దానిపై ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? అని కూడా ఆలోచించాను. కానీ అభిమానుల కోపాన్ని కూడా భరించి సైలెంట్ గానే ఉన్నాను.

  నమిత ఎందుకింత లావయ్యారు?:

  నమిత ఎందుకింత లావయ్యారు?:


  నాకు భోజనమంటే మహా ఇష్టం. నోరూరించే వంటకాలు ముందుంటే లిమిట్స్ ఉండవు. పుష్టిగా తినేస్తా. కేవలం సినిమాల కోసమే బరువు తగ్గుతాను. అంతే తప్ప ప్రత్యేకించి డైటింగ్ ఏమి పాటించను.

  ప్రభాస్.. అందుకే నచ్చాడు

  ప్రభాస్.. అందుకే నచ్చాడు

  ప్రభాస్‌ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. 'బిల్లా' మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు కెమెరా, లైటింగ్ సామాగ్రి కూడా మోసేవాడు. ఓ పెద్ద హీరో అలా అందరితో కలిసిమెలిసి పనిచేయడం నాకు నచ్చింది. నాకే కాదు ఎవరికైనా నచ్చుతుంది.

  English summary
  Actress Namita recently married her boyfriend Veera. She gave an interview about her personal and movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X