ఆ సిన్మాలో నమిత విశ్వరూపం!
నమిత తెలుగులో అంత బాగా రాణించక పోయినా, తమిళంలో మంచి అవకాశాలు రావడంతో ఒక స్థాయిలో స్థిరపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 'బిల్లా"తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. 'బిల్లా"లో నటించడానికి ముందే 'జగన్మోహిని" చిత్రంలో ఎంపికైంది. జయమాలిని నటించిన బ్లాక్ బస్టర్ 'జగన్మోహిని" చిత్రానికిది రీమేక్.
యన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో లక్ష్మి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో కథానాయికగా మీరా చోప్రా, కథాయకుడుగా రాజా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ వర్షన్ ట్రైలర్ ను శరత్ కుమార్ ఇటీవల విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నమిత" మరో జయమాలిని అవుతుందంటున్నారు.
ఒరిజినల్ వర్షన్ 'జగన్మోహిని" చిత్ర విజయానికి జయమాలిని ఎలా సహాయపడిందో...రీమేక్ చిత్రం 'జగన్మోహిని" సక్సెస్ కు కూడా నమిత అంతే ప్లస్ అవుతుంది" అని భావించారు. భారీ అందాలు ప్రదర్శించడంలో నమిత, జయమాలినికి దగ్గర పోలికలున్నాయి. నమిత జయమాలిని కంటే హైట్. సక్సెస్ విషయంలో మరి ఆ పోలికలు కలిసొస్తాయో లేదో వేచిచూద్దాం.


Click it and Unblock the Notifications











