యోగా పాఠాలు నేర్పే నమిత ‘లవ్ కాలేజ్’ సిద్ధం
నిండు కండల్లా తొనికిసలాడే భారీ అందాలతో ఊరిస్తూ తనకంటూ కొందరు అభిమానులను సంపాదించుకుంది నమిత. నమిత నటిస్తుంటే కేవలం ఆమె అందాలు చూడటానికే ప్రేక్షకులు, అభిమానులు థియేటర్లు వస్తారంటే...ఆమెకు ఉన్న క్రేజ్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. సింహా సినిమా తర్వాత మళ్లీ ఆమె అందాలు చూడటానికి నోచుకోలేదు తెలుగు అభిమానులు. ఈ నేపథ్యంలో నమిత అందాలే పెట్టుండిగా ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'లవ్ కాలేజ్". యమ్.జయసింహారెడ్డి దర్శకత్వంలో జయసింహా పిక్చర్స్ పతాకంపై యమ్.రవితేజా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్షికమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు.
లవ్ కాలేజ్ సినిమా గురించి దర్శకుడు జయసింహారెడ్డి మీడియాకు వివరిస్తూ...' యోగా టీచర్‌గా నమిత అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న ఆమె పాత్ర అందర్ని అలరించే విధంగా వుంటుంది. ఈ నెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి ఇదే నెల చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం" అని తెలిపారు. పృథ్వీరాజ్, శోభన, కవిత, డి.శ్రీకాంత్ తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకర్, ఎడిటింగ్: రంగస్వామి, ఫైట్స్: థ్రిల్లర్ మంజు. మరి నమిత అందాలపై పెట్టిన పెట్టుబడులు...ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెస్తాయా? లేదా? అనేది ఈ నెలలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











