For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైర్ తో స్టైయిట్ గా తెలుగులో కి నమిత

    By Srikanya
    |

    హైదరాబాద్ :భారీ అందాల నమిత తాజాగా మరో తెలుగు చిత్రం కమిటై చేస్తోంది. 'ఫైర్'అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గతంలో 'అల్లరే అల్లరి', 'రామ్‌దేవ్' వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్‌కె. బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'. ప్రస్తుతం కోకాపేట క్వారీల్లో షూటింగ్ జరుగుతోంది.

    ఈ సినిమా గురించి బషీద్ మాట్లాడుతూ "అమెరికా, హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్, కేరళతో పాటు హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపాం. నాలుగు పాటల్ని విదేశాల్లోని అందమైన లొకేషన్‌లలో తీశాం. ఓ పాటని రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీసెట్ వేసి రేఖ, డాన్సర్లపై చిత్రీకరించాం. ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ఇందులో హీరోయిన్ల పాత్రలు చాలా గ్లామరస్‌గా ఉండి, యువతను విశేషంగా ఆకర్షిస్తాయి. ఎం.ఎం. శ్రీలేఖ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ నెలలో పాటల్నీ, సెప్టెంబర్‌లో సినిమానీ విడుదల చేయబోతున్నాం''అన్నారు.

    అలాగే మరో వారం రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. మా సంస్థలో వచ్చిన 'అల్లరే అల్లరి'ని మించి ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని బషీద్ చెప్పారు. నమిత, 'ప్రేమిస్తే' సంధ్య, భానుశ్రీ మెహ్రా, రేఖ, మౌనిక, రిషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, నల్ల వేణు, వినోద్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎస్. సెల్వరాజ్, మధు ఎ. నాయుడు, కళ: బాబా, ఫైట్స్: దళపతి దినేశ్, డిఫరెంట్ డానీ, సమర్పణ: మాస్టర్ ఎస్‌కె. అబ్దుల్లా, నిర్మాత: ఎస్‌కె. కరీమున్నీసా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌కె. బషీద్.

    English summary
    Actress Namitha is set to make a comeback in Tollywood. The Gujarat-based model was not seen in big ticket films in Telugu after Simha but was busy signing Tamil and Kannada movies. Reports say that the buxom beauty is playing one of the leads in a Telugu film "Fire", directed by SK Bhasheed. Fire, which also stars Sandhya, Bhanusri Mehra, Rishika Singh and Rekha, is currently being filmed in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X