'సింహా’ టర్నింగ్ తో నమితకు తెలుగు, తమిళ, కన్నడంలో అవాకాశాల వెల్లువ!

By Sindhu

ఇప్పటివరకూ వెండి తెరపై తన అందచందాలను ఒలకబోసిన నమిత తమిళంలో రూపొందుతోన్న 'ఇలైయ్యన్" అనే చిత్రంలో నెగటివ్ టచ్ ఉన్న పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి భాషా ఫేమ్ సురేష్ కృష్ణన్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటివరకూ నమిత నెగటివ్ టచ్ ఉన్న పాత్రాలు చేసినప్పటికీ పూర్తి స్థాయి నెగటివ్ ఛాయలున్న పాత్ర మాత్రం చేయలేదు. దాంతో ఈ చిత్రం తనకు మంచి మలుపు అవుతుందని, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది అని నమిత చెబుతోంది. అంతే కాదండోయ్ ఈ బొద్దుగుమ్మ కన్నడంలోకి కూడా ఎంటర్ అయిపోయింది.

మళయాళ మందారం మీరా జాస్మిన్, అందాల 'బొద్దు"గుమ్మ నమిత కలిసి రవిచంద్రన్ సరసన తొలిసారి ఒక కన్నడ సినిమా 'హో"లో కనిపించబోతున్నారు. అభిమానులను కవ్వించబోతున్నారు. తెలుగులోకి అనువదించబడి ఈ నెల 28 న ఆంధ్ర రాష్ట్రమంతా విడుదలవుతున్న ఈ చిత్రానికి మాతృక ఓ కన్నడ సినిమా. మీరాజాస్మిన్, నమిత లకు ఇద్దరికీ ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉండటంతో, సదరు చిత్ర నిర్మాతలు దీన్ని తెలుగులోకి కూడా అనువదించి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి తొలిసారి ఈ ఇద్దరు ముద్దుగుమ్మల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X