60 ముసలాడితో నమిత శృంగారం... మోసం

By Srikanya

హాట్ హీరోయిన్ నమిత ఇప్పుడన్ని శృంగార భరిత పాత్రలే ఒప్పుకుంటోంది. తన అందాలచందాలుతో ప్రేక్షకులను ఆకట్టుకోవటం,నటనతో మెప్పుపొందటం కన్నా బెస్ట్ అని భావిస్తోంది. ఆ కోవలోనే ఆమె చేసిన చిత్రం మిడత పేరుతో తెలుగులో డబ్బింగ్ అయి వస్తోంది.శ్రీరామ్, నాజర్, నమిత, రగస్య కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని 'మిడత' పేరుతో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం కేవలం నమితను ఎరోటిక్ గా చూపటానికి మాత్రమే తీసారంటున్నారు. దానికి తగ్గట్లే కథను సైతం తయారు చేసుకుని వదులుతున్నారు.

ఇక త్వరలో తెలుగులో విడుదల అవుతున్న చిత్రం లో నమిత పాత్ర విషయానికి వస్తే ..ఆమె తన వయస్సు కన్నా రెట్టింపు వయస్సు ఉన్న వృద్దుడుని వివాహం చేసుకుని ...సుఖం పొందక అడ్డ దారులు తొక్కుతుంది. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినా.. తమ సినిమాలో నమిత అందచందాలు ప్రదర్శన చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ఓ వర్గాన్ని చేరువ చేసేందుకు విభిన్నంగా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిర్మాతలు కథను కూడా రివిల్ చేసి ఇందులో నమిత ఏ రకమైన పాత్ర చేయబోతోందో చెప్పి రసికులైన ప్రేక్షకులను ఊరిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కథ గురించి నిర్మాతలు చెపుతూ... ఆయనకు 60... ఆమెకు 30. తనకన్నా సగం వయసులో ఉన్న ఆ అమ్మాయిని పెళ్లాడతాడు ఆ వృద్ధుడు. ఆమెకోసం ఏ చేయడానికైనా వెనుకాడడు. డబ్బు, శృంగారం తప్ప అతనికి ప్రపంచంలో ఏదీ గొప్ప కాదు. ఆ వృద్ధ భర్తతో యువతి జీవితం ఎలా సాగుతుంది? అసలు తనకన్నా రెట్టింపు వయసున్న అతన్ని ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే 'మిడత'.

కె. రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనువాద పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -''నమిత మునుపెన్నడూ లేనంత గ్లామర్‌గా ఇందులో కనిపిస్తారు. శ్రీరామ్ పాత్ర చాలా హుందాగా ఉంటుంది. ఇక నాజర్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. వృద్ధ భర్తగా ఆయన నటించారు.

నాజర్ భార్యగా నమిత నటించారు. ఈ ఇద్దరి పాత్ర చిత్రణ వైవిధ్యభరితంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఒక ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా రీషూట్ చేశాం. ప్రస్తుతం చెన్నైలోని ప్రసాద్ 70 ఎంఎం థియేటర్‌లో ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యతీష్, సమర్పణ: నైనాల హైమవతి సాంబమూర్తి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X