'నమితా ఐ లవ్ యు' అంటూ కమిటయిన నిర్మాత
నమిత బారీ అందాల మీద కన్నడ దర్శక, నిర్మాత రవితేజ రెడ్డి బాగా నమ్మకం పెట్టుకున్నాడు. తాజాగా ఆయన నమిత ప్రధాన పాత్రలో నమిత ఐ లవ్ యు అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. కధ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం అన్నీ తానై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిజానికి ఆ నిర్మాత నమితతో ప్రేమలో పడే ఈ చిత్రం కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాడంటున్నారు. ఇక ఈ టైటిల్ వినగానే నమిత మారు మాట్లాడకుండా డేట్స్ ఇచ్చిందని సమాచారం. సింహా తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాని నమిత ఈ చిత్రంతో కన్నడంలోనూ తన హవా ప్రారంభమవుతుందని ఆశిస్తోంది. ఇక ఈ చిత్రం ఓ ప్రేమ కథగా సాగుతుందని, మశాలా దృశ్యాలకు కూడా లోటు ఉండదని చెప్తున్నారు. నిర్మాత కూడా నమిత అంటే వెంటనే మార్కెట్ అవుతుందనే ఆశించి ఈ ప్రాజెక్టును చేపట్టాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











