నమిత పగ తీర్చుకుంటుందా?
బరువెక్కిన భారీ అందాలతో మెప్పిస్తూ తనకంటూ ఓ అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న నాయిక నమిత. సింహా తర్వాత నమిత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది లేదు. తాజా ఆమె ప్రధాన పాత్రగా ఓ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. నిట్‌క్యాప్ మీడియా క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూవీకి రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఇటీవలే సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డాడి.రామానాయుడు క్లాప్‌నివ్వగా, అగ్రిగోల్డ్ ఎం.డి పుష్పలత సీతారాం కెమెరా స్విచ్చాన్ చేశారు. సాగర్ గౌరవదర్శకత్వం వహించారు.
ఈ సినిమా గురించి నిర్మాత శ్రీను కశ్యప్ మాట్లాడుతూ 'మా బేనర్‌లో 2వ సినిమా ఇది. నమిత యాక్షన్ నాయికగా కనిపిస్తారు. ఓ కుగ్రామంలోని నిరుపేద యువతి తన జీవితాన్ని ఎలా ఎదుర్కుంది అనేదే ఈ సినిమా. తనకు అన్యాయం చేసినవారిపై పగ ఎలా తీర్చుకుందనేది తెరపైనే చూడాలి" అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'మహిళా ప్రధాన చిత్రమిది. నాలుగు రోజులు ఇక్కడ చిత్రీకరణ చేసి రాజమండ్రి వెళతాం" అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత జి.ఎ.రావు మాట్లాడుతూ 'నవంబర్ 29వరకూ రాజమండ్రి షెడ్యూల్ చేస్తాం. డిసెంబర్ 10 తర్వాత పొలాచ్చి, రాజమండ్రిలో చిత్రీకరణ చేస్తాం" అన్నారు.
ఇప్పటి వరకు తన బరువైన అందాలను ఆరబోస్తూ కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే కనిపించి నమిత...ఈ కొత్త తరహా పాత్రలో ఎలా కనిపించబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అదే సమయంలో...ఇలాంటి కథలో నమిత అందాలు ఆరబోతు ఉంటుందా? లేదా? అని ఆమె అందాలను చూడటం కోసమే థియేటర్లకు వచ్చే అభిమానులు అయోమయంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











