భారీ అందాల నమిత ఇప్పుడు సౌత్ లో స్టార్ గా వెలుగుతోంది. ఓ వర్గానికి ఆమె పిచ్చ పిచ్చగా నచ్చేస్తూండటంతో ఆమెను తమ సినిమాలో బుక్ చేస్తే మినిమం గ్యారెంటీ అనేది ఇన్నాళ్ళూ తమిళ దర్శక,నిర్మాతల్లో భావన ఉంది. ఇక అదే స్కీమ్ లో ఆ మధ్య తెలుగులోనూ ఆమెను తమ సినిమాల్లో బుక్ చేద్దామని ప్రయత్నించారు. అయితే గతంలో తెలుగు పరిశ్రమతో తిన్న ఎదురు దెబ్బల ఎఫెక్టు తో ఆమె నొ చెప్పేసింది. అందులోనూ ఆమెను సెకెండ్ హీరోయిన్ లేదా ఐటం గర్ల్ గానో అడగటం ప్రారంభించటంతో ఆమెకు చిరాకొచ్చేసింది. అయితే తాజాగా ఆమె ప్రభాస్ హీరోగా నిర్మించనున్న భిల్లా రీమేక్ చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించటానికి కమిటయ్యింది. విజయ దశమి రోజు ప్రారంభమైన ఈ చిత్రానికి భిల్లా అనే పేరే పెట్టారు. కంత్రి సినిమాను దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.గోపీకృష్ణ మూవీస్ పై కృష్ణ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూష్క ఈ సినిమాలో రెట్టింపు రెమ్యునేషన్ తీసుకుని మరీ బికినీ సీన్ లో కనిపించటానికి రెడీ అవుతోంది. ఇక దీనికి తోడు నమిత అందాలు కూడా కలవటంతో ఈ చిత్రంపై ట్రేడ్ లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.