సిల్క్ స్మిత పాత్రలో నమిత అందాలు అపరిమితం..!
నిన్నటి తరం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత కథను ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డర్టీ పిక్చర్ పేరిట నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ స్మిత పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమె సెక్సీగా కనపడడం కోసం తన బాడీ షేపులను కూడా మార్చుకుందని వార్తలొచ్చాయి. ఇదిలా ఉంచితే, ఇప్పుడు ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'సిల్క్ స్మిత" పేరుతో రూపొందే ఈ సినిమాలో నేటి సెక్సీ తార నమిత టైటిల్ రోల్ పోషిస్తుందట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యుల్ లో దీనిని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తన మత్తు కళ్ళతో కుర్రకారుకి కైపెక్కించిన స్మితను ఇప్పుడు నమిత ఎలా మైమరపిస్తుందో చూడాలి.
ప్రస్తుతం నమిత ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని వన్ విజయన్ మీడియా వారు 'పచ్చిమిరపకాయ్" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. 'అత్త అల్లుడు మధ్య జరిగే ఓ ఛాలెంజ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. వీరి మధ్యలో హీరోయిన్ నమిత ఏం చేసిందనేది ఆద్యంతం ఆసక్తికరంగా వుంటుంది. ఇప్పటివరుకు నమిత చేసిన చిత్రాలకు భిన్నంగా వుంటుది. ఆమె గ్లామర్ తో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది. నమిత గ్లామర్ సినిమాకి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వివేక్ కామెడీతో అలరిస్తాడు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.


Click it and Unblock the Notifications











