For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నమిత అశ్లీల వీడియోలు.. ఆన్‌లైన్ బెదిరింపులు.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన హీరోయిన్! ఇష్యూ వైరల్..

  |

  రోజు రోజుకూ టెక్నాలజీ పెరిగిపోతుందని ఆనంద పడాలా? లేక అదే ఆసరాగా తీసుకొని ఆన్‌లైన్ బెదిరింపులు, సైబర్ మోసాలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన చెందాలా? అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. టెక్నాలజీ పెరుగుతూ పోతుంటే అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సైబర్ మోసాలు బయటపడగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ నమితకు ఆన్‌లైన్ బెదిరింపులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

  నమితగా పరిచయం.. ఆమె అసలు పేరు

  నమితగా పరిచయం.. ఆమె అసలు పేరు

  నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. జెమిని సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి వచ్చిన ఆమె ఆ తర్వాత ''సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి'' చిత్రాలలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

   తెలుగు తెరపై సూపర్ పర్‌ఫార్‌మెన్స్.. మరచిపోగలమా?

  తెలుగు తెరపై సూపర్ పర్‌ఫార్‌మెన్స్.. మరచిపోగలమా?

  ఒకానొక సమయంలో తెలుగు తెరపై సూపర్ హిట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చి తన అందచందాలతో యువత మనసు దోచుకుంది హీరోయిన్ నమిత. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ స్థాయి క్రెడిట్ కొట్టేసిన ఈ భామ ఆ తర్వాతి కాలంలో సినిమా జోష్ తగ్గించేసింది. అయినప్పటికీ నమితను ఎవ్వరూ మరచిపోలేదు.

   అనుక్షణం అందుబాటులో..

  అనుక్షణం అందుబాటులో..

  కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-1లో కూడా నమిత పాల్గొంది. 2017లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వీటితో పాటు సోషల్ మీడియాలోనూ అనుక్షణం అందుబాటులో ఉండటం నమిత నైజం.

   యువకుడి నిర్వాకం.. బయటపెట్టిన నమిత

  యువకుడి నిర్వాకం.. బయటపెట్టిన నమిత

  ఈ నేపథ్యంలో అదే సోషల్ మీడియా ద్వారా నమితను బెదిరించాడు ఓ ప్రబుద్దుడు. దీంతో అతని ఫొటోతో సహా బయటపెడుతూ ఆ సంగతి గురించి వివరించింది నమిత. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది.

  నమిత అశ్లీల వీడియోలు.. బెదిరింపులు

  నమిత అశ్లీల వీడియోలు.. బెదిరింపులు

  సెంటమిజ్‌ అనే ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో తనకు డైరెక్ట్‌ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించినట్లు తెలిపింది నమిత. 'హాయ్‌ ఐటమ్‌' అంటూ నీచంగా ప్రవర్తించాడని.. తాను ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని బుకాయిస్తూ అతని వద్ద తన అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడని తెలిపింది.

  నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి.. నమిత ఫైర్

  అయితే అందులో నిజమెంతో తనకు తెలుసు కాబట్టి.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పానని పేర్కొంది. ''నేను గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నందున్న నా గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా?. ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు?. నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. ఒక నిజమైన మనిషికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి'' అని నమిత ఫైర్ అయింది.

  English summary
  Senior heroine Namitha expressed her Namitha porn videos issue which is occured in social media platform. Now this issue is going hot topic in film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X