For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితంలో మూడు బ్రేకప్స్.. అందుకే ఆయనతో పెళ్లి.. తాళి తప్ప మరో మార్పు లేదు.. నమిత

    By Rajababu
    |
    అందుకే ఆయనతో పెళ్లి.. తాళి తప్ప మరో మార్పు లేదు..!

    దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్రతార వెలిగిన నమిత వివాహం ఇటీవల జరిగింది. కొద్దికాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న నిర్మాత, మోడల్ వీరేంద్ర చౌదరీని నమిత వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 24న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరేంద్రతో పెళ్లి తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన నమిత తన వ్యక్తిగత, దాంపత్య జీవిత విషయాలను వెల్లడించింది.

     మా లవ్ స్టోరి సింపుల్

    మా లవ్ స్టోరి సింపుల్

    మా ప్రేమ కథ చాలా సింపుల్. ఎలాంటి ట్విస్టులు లేవు. శశి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వీరేంద్ర నాకు పరిచయం అయ్యాడు. ఆధ్యాత్మికం, రాజకీయాలను వీరేంద్ర బాగా విశ్లేషిస్తాడు. దాంతో మా మధ్య వేవ్ లెంగ్త్ పెరిగింది.

     వీరేంద్ర మంచితనంతో

    వీరేంద్ర మంచితనంతో

    వీరేంద్ర మంచితనం నన్ను ఆకట్టుకొన్నది. వెంటనే స్నేహితులమయ్యాం. తరచు కలుసుకొనే వాళ్లం. నాకు చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మా స్నేహం బలపడుతున్న సమయంలోనే నాకు తమిళ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లమని అతనే ప్రోత్సాహించాడు.

     బిగ్‌బాస్ షో సమయంలో

    బిగ్‌బాస్ షో సమయంలో

    నేను ఎప్పుడూ నా కుటుంబానికి దూరంగా ఉండలేదు. బిగ్‌బాస్‌లో పాల్గొనడమంటే చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో భయపడ్డాను. కానీ వీరేంద్ర ధైర్యం చెప్పి నా కుటుంబాన్ని గురించి చూసుకొంటాను అని ధైర్యం ఇచ్చాడు. దాంతో బిగ్‌బాస్‌కు ఓకే చెప్పాను.

    వీరేంద్ర ప్రపోజ్‌తో ఎమోషనల్

    వీరేంద్ర ప్రపోజ్‌తో ఎమోషనల్

    బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రోజు రాత్రి నాకు ప్రపోజ్ చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని వీరేంద్ర చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. వీరేంద్రను నేను తొలిసారి 2016 సెప్టెంబర్ 6న కలిశాను. ఆ తర్వాత ఏడాది అనంతరం నాతో పెళ్లి చేసుకొందామా అని అడిగారు. దాంతో పెళ్లి కల సాకారమైంది. అతడితో జీవితం ఓ చక్కటి ప్రయాణంలా ఉంది. వీరేంద్ర చాలా విషయాలపై పట్టు ఉంది.

    పెళ్లి తర్వాత మార్పులు లేవు

    పెళ్లి తర్వాత మార్పులు లేవు

    పెళ్లి తర్వాత నాకు పెద్దగా మార్పులు కనిపించలేదు. మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు వచ్చాయి. అంతకు మంచి జీవితంలో మార్పు ఏమీ జరగలేదు. అత్తామామల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కుంకుమ పెట్టుకో, చీర కట్టుకో అని నా భర్త, అత్తామామలు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.

    నా జీవితంలో మూడు బ్రేకప్స్

    నా జీవితంలో మూడు బ్రేకప్స్

    నా జీవితంలో నాకు మూడు బ్రేకప్స్ ఉన్నాయి. వాటి అనుభవంతో జీవితంలో ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలనే విషయం తెలిసింది. వీరేంద్ర పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఆయన ప్రపోజల్‌ను తిరస్కరించడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఒకవేళ ఆయన ప్రపోజ్‌ చేయకపోయి ఉంటే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని నేనే అడిగేదాన్ని' అంటూ నమిత చెప్పింది.

    English summary
    Namitha marriage announcement with Veerandra Chowdhary came as a pleasant surprise for her fans. But Namitha tells us that she didn't feel the need to wait for months together to get married once she was sure she had found her soulmate. The actress tied the knot with Veer, as she fondly calls her husband, on November 24, in Tirupati, in a private ceremony attended only by family and a few friends from the industry. In this occassion, she revealed her personal relation with Veerandhra and marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X