Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జీవితంలో మూడు బ్రేకప్స్.. అందుకే ఆయనతో పెళ్లి.. తాళి తప్ప మరో మార్పు లేదు.. నమిత
Recommended Video
దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్రతార వెలిగిన నమిత వివాహం ఇటీవల జరిగింది. కొద్దికాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న నిర్మాత, మోడల్ వీరేంద్ర చౌదరీని నమిత వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 24న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరేంద్రతో పెళ్లి తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన నమిత తన వ్యక్తిగత, దాంపత్య జీవిత విషయాలను వెల్లడించింది.
మా లవ్ స్టోరి సింపుల్
మా ప్రేమ కథ చాలా సింపుల్. ఎలాంటి ట్విస్టులు లేవు. శశి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వీరేంద్ర నాకు పరిచయం అయ్యాడు. ఆధ్యాత్మికం, రాజకీయాలను వీరేంద్ర బాగా విశ్లేషిస్తాడు. దాంతో మా మధ్య వేవ్ లెంగ్త్ పెరిగింది.
వీరేంద్ర మంచితనంతో
వీరేంద్ర మంచితనం నన్ను ఆకట్టుకొన్నది. వెంటనే స్నేహితులమయ్యాం. తరచు కలుసుకొనే వాళ్లం. నాకు చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మా స్నేహం బలపడుతున్న సమయంలోనే నాకు తమిళ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లమని అతనే ప్రోత్సాహించాడు.
బిగ్‌బాస్ షో సమయంలో
నేను ఎప్పుడూ నా కుటుంబానికి దూరంగా ఉండలేదు. బిగ్‌బాస్‌లో పాల్గొనడమంటే చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో భయపడ్డాను. కానీ వీరేంద్ర ధైర్యం చెప్పి నా కుటుంబాన్ని గురించి చూసుకొంటాను అని ధైర్యం ఇచ్చాడు. దాంతో బిగ్‌బాస్‌కు ఓకే చెప్పాను.
వీరేంద్ర ప్రపోజ్‌తో ఎమోషనల్
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రోజు రాత్రి నాకు ప్రపోజ్ చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని వీరేంద్ర చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. వీరేంద్రను నేను తొలిసారి 2016 సెప్టెంబర్ 6న కలిశాను. ఆ తర్వాత ఏడాది అనంతరం నాతో పెళ్లి చేసుకొందామా అని అడిగారు. దాంతో పెళ్లి కల సాకారమైంది. అతడితో జీవితం ఓ చక్కటి ప్రయాణంలా ఉంది. వీరేంద్ర చాలా విషయాలపై పట్టు ఉంది.
పెళ్లి తర్వాత మార్పులు లేవు
పెళ్లి తర్వాత నాకు పెద్దగా మార్పులు కనిపించలేదు. మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు వచ్చాయి. అంతకు మంచి జీవితంలో మార్పు ఏమీ జరగలేదు. అత్తామామల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కుంకుమ పెట్టుకో, చీర కట్టుకో అని నా భర్త, అత్తామామలు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.
నా జీవితంలో మూడు బ్రేకప్స్
నా జీవితంలో నాకు మూడు బ్రేకప్స్ ఉన్నాయి. వాటి అనుభవంతో జీవితంలో ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలనే విషయం తెలిసింది. వీరేంద్ర పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఆయన ప్రపోజల్‌ను తిరస్కరించడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఒకవేళ ఆయన ప్రపోజ్ చేయకపోయి ఉంటే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని నేనే అడిగేదాన్ని' అంటూ నమిత చెప్పింది.