»   » ఫోటోలు : భయపెడుతున్న నమిత అవతారం!

ఫోటోలు : భయపెడుతున్న నమిత అవతారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బొద్దు గుమ్మ అంటూ పొగిడే పొగడ్తలు బాగా నచ్చయో ఏమో..! తెలియదు కానీ హాట్ సుందరి నమిత రోజు రోజుకు తన బాడీ సైజును భారీగా పెంచుతోంది. ఏ రేంజిలో అంటే హీరోలు భయపడే రేంజిలో. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత నమిత ఐటం భామగా మారిన సంగతి తెలిసిందే.

దీంతో పలు సినిమాల్లో ఐటం సాంగులో నర్తించి అలరించింది. కొన్ని సినిమాల్లో హీరోలు ఆమెకంటే కాస్త సైజు తక్కువగా ఉన్నా...ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని అడ్జెస్ట్ అయి నటించారు. కానీ ఇప్పుడు మాత్రం కొందరు హీరోలు ఆమెతో చేయాలంటే భయ పడుతున్నారట. స్టెప్పులేస్తుంటే పొరపాటు అదుపుతప్పి ఆమె భారీ శరీరం కింద పడి నలిగిపోతే మా పరిస్థితి ఏమిటి? అంటూ ఆమెతో చేయడానికి తిరస్కరిస్తున్నారట.

అందాల ఆరబోతతో తన సినీ కెరీర్‌ని లాక్కొచ్చేస్తున్న నమితకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి పెద్ద పోటీ ఎదురవుతోంది. ముంబై నుంచి రోజుకో భామ దిగుతూ నమితకు ఓ రేంజిలో సవాల్ విసురుతోంది. ఈ మధ్య పలువురు హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేయడానికి వెనకాడటం లేదు....దీంతో నమిత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

బిజినెస్ ఆలోచనలో నమిత

బిజినెస్ ఆలోచనలో నమిత


నమిత అంటే ఆమె అభిమానులుకు ఎంత అభిమానం అంటే ఆమెకు గుడి కూడా కట్టేసి పూజలు చేసేస్తున్నారు. ఆమె సినీ రగం నుంచి తప్పుకుని బిజినెస్ లోకి పూర్తిగా దిగుతానంటే వారంతా కుదరదని ఆమెను కలిసి చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టమని కోరుతున్నారు.

ఆమెతో చేయడానికి హీరోలు కరువు

ఆమెతో చేయడానికి హీరోలు కరువు


చేసేవి చిన్నా చితకా చిత్రాలే అయినా నమితతో చేస్తే బిజినెస్‌కి మాత్రం ఢోకా ఉండదనే పేరు తెచ్చుకుంది. ఆ రేంజిలో ఓ వర్గం అభిమానులను సంపాదించుకుంది నమిత. అయితే ఆమెతో చేయగలిగే హీరోలే ఇండస్ట్రీలో ఉండకపోవటం సమస్య అయ్యింది.

సింహాలో అదరగొట్టింది కానీ...

సింహాలో అదరగొట్టింది కానీ...


బాలకృష్ణ సింహా తర్వాత నమిత నటించిన ఏ చిత్రమూ రిలీజ్ అవ్వలేదు. సింహాలో ఆమె చేసిన మహేశ్వరి అనే ప్రొపెసర్ పాత్రకు ఆమెకు పేరు అయితే వచ్చింది, ఆమె చేసిన టైటిల్ సాంగ్ లో కూడా అదరకొట్టింది కానీ కెరీర్ కి ప్లస్ కాలేదు.

బిల్లాలో సెక్సీగా...

బిల్లాలో సెక్సీగా...


బిల్లా లో ప్రభాస్ గర్ల్ ప్రెండ్ లీసా గా చేసింది. ఆమె బికిని వేసి మరీ అలరించే ప్రయత్నం చేసింది. ఆమె గ్లామర్ షో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా మారింది. అయితే ఆ తర్వాత నమిత గ్లామర్ షేప్ ఔట్ అయింది. ఆమె సైజు భారీగా పెరిగిపోయింది.

ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు

ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు


ఎన్ని ప్లాప్‌లు ఉన్నా తమిళంలో ఆ మధ్య వరస సినిమాలు దక్కించుకుంది. ఈమె సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సెక్సీగా ఉండటానికి, తన అభిమానులను అలరించటానికి ఎప్పుడూ సిద్దమనే నమితకు పరిస్థితులే కలిసి రావడం లేదు.

English summary
The South Indian Glam Doll Namitha was slim and chic when she came to industry. According to a source Namitha is strictly following Yoga and Diet to get back all her curves for sharpening her body more glamour.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu