నమిత ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు

By Srikanya

నమిత ప్రధాన పాత్రలో 'శుక్ర' అనే చిత్రం రీసెంట్ గా మొదలైంది. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎం.రవివర్మ డైరక్ట్ చేస్తున్నారు. ఎస్‌.ఆర్‌.పి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే నూతన చలనచిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ చిత్రంలో నమిత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.ఈ విషయమై దర్శకుడు మీడియా తో మాట్లాడుతూ..నేను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వద్ద పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను.

ఈ చిత్ర నిర్మాతలు నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. నమిత ఈ సినిమాలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. వచ్చే నల 14 నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమౌతుంది. రెండు షెడ్యూళ్ళలో సినిమా పూర్తవుతుంది. సినిమాలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రారంభం రోజున వెల్లడించనున్నాము అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X