నమిత చేస్తున్న బిజినెస్‌పై అనుమానాలు

ఈ వ్యాపారంపై ఆమె మాట్లాడుతూ...నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది, ఓ వైపు నటన... మరోవైపు వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ, అభిమానుల కోసం తగినంత సమయం కేటాయిస్తానంటోంది. అభిమానులను తాను ఎప్పడూ దూరం చేసుకోనని స్పష్టం చేసింది.
"ఇప్పట్లో సినిమాల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదు. సినిమారంగాన్ని నేను ఎంతో ప్రేమిస్తా. నాకు ఎంతో గుర్తింపునిచ్చిన ఈ రంగంలోనే మరింత కాలం కొనసాగాలనుంది. తమిళంలో ఆఫర్లు బాగా వస్తున్నాయి. వీటిలో మీకు కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తా. నా అభిమానులను రంజింపజేయడానికి కొత్త అవతారం ఎత్తబోతున్నా. ఇదివరకటిలాగా హాట్ సీన్లలో కాకుండా యాక్షన్, అడ్వెంచర్ స్టంట్స్ సీన్లను చేయబోతున్నా. ఇవి నా అభిమానులకు తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నా"" అని నమిత వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం నమిత తెలుగులో 'లవ్ కాలేజ్" అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె యోగా టీచర్ గా నటిస్తోంది. యమ్.జయసింహారెడ్డి దర్శకత్వంలో జయసింహా పిక్చర్స్ పతాకంపై యమ్.రవితేజా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్షికమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు. . పృథ్వీరాజ్, శోభన, కవిత, డి.శ్రీకాంత్ తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకర్, ఎడిటింగ్: రంగస్వామి, ఫైట్స్: థ్రిల్లర్ మంజు.


Click it and Unblock the Notifications











