బినామీలపై సెక్సీ నమిత పోరాటం
బినామీలపై నమిత చేసే పోరాటమే చిత్రం ప్రధాన కథాంశంగా 'శుక్ర"అనే చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటివరకూ అనేక గ్లామర్ పాత్రలు పోషించిన నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించటమే స్పెషల్ అనిచెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన రవివర్మ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు దృశ్యానికి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మురళీమోహన్ క్లాప్ ఇచ్చారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం నమిత మాట్లాడుతూ ...కథ బాగా నచ్చింది. ఇందులో కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాను"" అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -''బినామీలపై నమిత చేసే పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథాంశం.మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తవుతుంది అంది. నిర్మాతలు మాట్లాడుతూ -''కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాం. ఇందులో ప్రతి సన్నివేశమూ ఆకట్టుకుంటుంది"" అని చెప్పుకొచ్చారు. రాజ్ సందేశ్, డింపుల్, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. దర్శకత్వంలో ఎస్.ఆర్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అబీబ్ నజీర్, పాలమూరు పాండు ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











