శ్రీవారి కోసం వచ్చిన నమిత
హాట్ హీరోయిన్ నమిత తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మంగళవారం తిరుమల వచ్చింది. అయితే మీడియాతో ఎక్కువగా మాట్లాడకుండానే అమ్ముడు తుర్రుమంది. కనీసం తన తర్వాతి సినిమాల గురించి కూడా నమిత నోరు విప్పలేదు. దీంతో చేసేది లేక ఆమె అందాలను మాత్రమే తమ కెమెరాల్లో బంధించి మిన్నకున్నారు మీడియా మిత్రులు.
నమిత త్వరలో మిడత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ఓ తమిళ రొమాంటిక్ చిత్రం తెలుగులో 'మిడత' టైటిల్ తో అనువాదం అవుతోంది. లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులో 'మిడత' పేరిట విడుదల చేస్తున్నారు.
కె.రాజేశ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీరామ్, రగస్య, నాజర్, వివేక్, రాధారవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర విశేషాలను సాయిరామ్ చెబుతూ - 'ఇందులో నమిత వైవిధ్యభరితమైన పాత్ర చేసింది. గ్లామర్‌కి మాత్రమే కాకుండా నటనకు కూడా అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు.
సినిమా కథ విషయానికొస్తే...డబ్బు కోసం మోడలింగ్‌లోకి అడుగు పెట్టే నమిత ఓ కంపెనీ యజమాని అయిన శ్రీరామ్‌తో ప్రేమలో పడుతుంది. అతను పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతుంటే, ఈమె మాత్రం డబ్బు, హోదా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైకి ఎదగడం కోసం నైతికంగా కిందికి దిగజారిపోతూ ఉంటుంది. ఇలా అనేక ట్విస్టులతో సినిమా సాగుతుంది. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications