ఘనంగా నమిత పెళ్లి.. తారల హడావిడి.. (ఫొటోలు)

By Rajababu

Recommended Video

ఘనంగా నమిత పెళ్లి.. ఫొటోలు ఇవే..!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీతారగా పేరు సంపాదించుకొన్న అందాల భామ నమిత పెళ్లి శుక్రవారం (నవంబర్ 24న) తిరుపతిలో ఘనంగా జరిగింది. తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో నమిత వివాహ్వం జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

పెద్దలు, పండితులు నిర్ణయించిన ముహుర్తం వీరేంద్ర చౌదరీతో నమిత పెళ్లి శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ జరిగింది. ప్రముఖుల రాకతో సందడిగా మారడంతో భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

 నమిత సంగీత్‌కు ఏర్పాట్లు

నమిత సంగీత్‌కు ఏర్పాట్లు

నమిత పెళ్లిలో భాగంగా జరిగే సంగీత్ కార్యక్రమం గురువారం (నవంబర్ 23న) రాత్రి తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్‌లో జరిగింది. రాత్రి 7: 30 ప్రారంభమైన కార్యక్రమం అర్థరాత్రి వరకు సాగింది.

 సోషల్ మీడియాలో మెహందీ ఫొటోలు

సోషల్ మీడియాలో మెహందీ ఫొటోలు

తాజాగా బుధవారం జరిగిన మెహందీ, ఆ తర్వాత సంగీత్ కు ముస్తాబవుతున్న తన ఫోటోలను నమిత సోషల్ మీడియా లో షేర్ చేసింది. మీడియాలో నమిత పెళ్లి ప్రముఖంగా మారింది.

 వీరేంద్రతో నమిత వివాహం

వీరేంద్రతో నమిత వివాహం

మోడల్, నిర్మాత, సినీ నటుడు వీరేంద్ర చౌదరి, నమిత మధ్య కొంతకాలంగా అఫైర్ నడుసున్నది. తన వివాహం గురించి హీరోయిన్ నమిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

 వీరేంద్ర మోడల్, నిర్మాత

వీరేంద్ర మోడల్, నిర్మాత

వీరేంద్ర సూపర్ మోడల్. అంతేకాకుండా వర్థమాన నటుడిగా తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. సినీ నిర్మాతగా కూడా పేరున్నది. సినీ నిర్మాణంలో భాగంగా నమితతో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం నమితను వివాహం చేసుకోవాలని వీరేంద్ర నిర్ణయించుకొన్నారు.

 మిస్ సూరత్‌గా నమిత

మిస్ సూరత్‌గా నమిత

నమిత తన 15వ ఏటనే 1998లో మిస్ సూరత్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో శ్రీను వైట్ల రూపొందించిన సొంతం అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర సీమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత వెంకటేష్‌తో నటించిన జెమినీ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 కోయంబత్తూరులో నమితకు గుడి

కోయంబత్తూరులో నమితకు గుడి

తెలుగులో నటిస్తూనే తమిళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. వరసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో స్టార్ హీరోయిన్‌గా మారింది. నమిత నటనకు ఫిదా అయిపోయిన అభిమానులు 2008లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఆమెకు గుడికట్టారు. తమిళ హీరోయిన్లలో గుడికట్టించుకున్న వారిలో నమిత రెండోవారు. అంతకుముందు కుష్భూకు గుడికట్టిన సంగతి తెలిసిందే.

 బిగ్‌బాస్‌లో మెరిసిన నమిత

బిగ్‌బాస్‌లో మెరిసిన నమిత

ఇటీవల తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా నమిత పాల్గొన్నారు. అనేక వివాదాలు చుట్టుముట్టిన ఆ కార్యక్రమంలో నమిత మెప్పించింది. అయితే చివరకు వరకు నిలిచి విజేతగా మారడంలో విఫలమైంది.

 తిరుపతిలో సందడి

తిరుపతిలో సందడి

నమిత వివాహం కార్యక్రమం నేపథ్యంలో తిరుపతి పట్టణంలో సందడిగా భారీగానే కనిపిస్తున్నది. ఈ వివాహానికి తమిళ, తెలుగు రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X