నమిత పెళ్లికి హాజరవుతున్నది ఎవరో తెలుసా?.. మెహందీ, సంగీత్ ఫొటోలు
Recommended Video

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీతారగా పేరు సంపాదించుకొన్న అందాల భామ నమిత పెళ్లి ఈ నెల 24న తిరుపతిలో జరగనున్నది. పెళ్లికి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో నమిత వివాహ్వం జరగనున్న విషయం తెలిసిందే. నమిత పెళ్లి, జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

నమిత సంగీత్‌కు ఏర్పాట్లు
నమిత పెళ్లిలో భాగంగా జరిగే సంగీత్ కార్యక్రమం గురువారం (నవంబర్ 23న) తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్‌లో జరుగనున్నది. ఈ కార్యక్రమం రాత్రి 7: 30 నుంచి ప్రారంభం కానున్నది.

సోషల్ మీడియాలో మెహందీ ఫొటోలు
తాజాగా బుధవారం జరిగిన మెహందీ, ఆ తర్వాత సంగీత్ కు ముస్తాబవుతున్న తన ఫోటోలను నమిత సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఇక తిరుపతిలో ఈ నెల 24న ఉదయం 5. 30 నిమిషాలకు ఇస్కాన్ టెంపుల్ లో వివాహం జరగనుంది.

వీరేంద్రతో నమిత వివాహం
వీరేంద్ర చౌదరితో తన వివాహం గురించి హీరోయిన్ నమిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చాలాకాలంగా నమిత, వీరేంద్ర మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే.

వీరేంద్ర మోడల్, నిర్మాత
వీరేంద్ర సూపర్ మోడల్. అంతేకాకుండా వర్థమాన నటుడిగా తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. సినీ నిర్మాతగా కూడా పేరున్నది. సినీ నిర్మాణంలో భాగంగా నమితతో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం నమితను వివాహం చేసుకోవాలని వీరేంద్ర నిర్ణయించుకొన్నారు.

మిస్ సూరత్‌గా నమిత
నమిత తన 15వ ఏటనే 1998లో మిస్ సూరత్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో శ్రీను వైట్ల రూపొందించిన సొంతం అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర సీమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత వెంకటేష్‌తో నటించిన జెమినీ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

కోయంబత్తూరులో నమితకు గుడి
తెలుగులో నటిస్తూనే తమిళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. వరసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో స్టార్ హీరోయిన్‌గా మారింది. నమిత నటనకు ఫిదా అయిపోయిన అభిమానులు 2008లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఆమెకు గుడికట్టారు. తమిళ హీరోయిన్లలో గుడికట్టించుకున్న వారిలో నమిత రెండోవారు. అంతకుముందు కుష్భూకు గుడికట్టిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్‌లో మెరిసిన నమిత
ఇటీవల తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా నమిత పాల్గొన్నారు. అనేక వివాదాలు చుట్టుముట్టిన ఆ కార్యక్రమంలో నమిత మెప్పించింది. అయితే చివరకు వరకు నిలిచి విజేతగా మారడంలో విఫలమైంది.

తిరుపతిలో సందడి
నమిత వివాహం కార్యక్రమం నేపథ్యంలో తిరుపతి పట్టణంలో సందడిగా భారీగానే కనిపిస్తున్నది. ఈ వివాహానికి తమిళ, తెలుగు రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











