For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుపతిలోనే పెళ్ళి: బయటికి వచ్చిన నమిత వెడ్డింగ్ కార్డు

    |
    నమిత వెడ్డింగ్ కార్డు చూసారా ?

    సీనియర్‌ నటుడు శరత్‌బాబుతోనట.! ఈ గాసిప్‌ కొన్నాళ్ళ క్రితం గట్టిగా విన్పించింది. అయితే, అది గాలి వార్త మాత్రమేనని నమిత కొట్టి పారేసింది. 'ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే లైఫ్‌ని సోలోగా ఎంజాయ్‌ చెయ్యాలనుకుంటున్నాను.. ఇప్పటికైతే నాకెలాంటి ప్రేమ వ్యవహారాలూ లేవు..' అని అప్పట్లో క్లారిటీ ఇచ్చిన నమిత, అందరికీ షాకిస్తూ, పెళ్ళి కబురు చెప్పేసింది.

    వీరేంద్ర అనే వ్యక్తి

    వీరేంద్ర అనే వ్యక్తి

    వీరేంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నట్లు రీసెంట్ గానే ప్రకటించింది నమిత. తన మ్యారేజ్ విషయాన్ని సడెన్ గా అధికారికంగా వెల్లడించి అందరికీ నమిత షాక్ ఇవ్వగా.. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన అనేక సంగతులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నమిత తన వెడ్డింగ్ కార్డును అందరికీ చూపించేసింది కూడా.

     ఇస్కాన్ టెంపుల్ లో

    ఇస్కాన్ టెంపుల్ లో

    తిరుపతిలోని ఓ హోటల్ లో ఈ నెల 22న సాయంత్రం 7.30 గంటలకు మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరి- నమిత, ముకేష్ కుమార్ వంకావల జంటకు.. సంగీత్ ఏర్పాటు చేసినట్లు ఓ పేజ్ ను ప్రింట్ చేయగా.. మరో పేజ్ లో నవంబర్ 24 న ఉదయం 5.30 గంటలకు ఇస్కాన్ టెంపుల్ లో పెళ్లి ముహూర్తంగా నిర్ణయించినట్లు మరో పేజ్ లో ప్రకటించారు.

    నెల 24న తిరుపతిలో

    నెల 24న తిరుపతిలో

    అటు సంగీత్.. ఇటు పెళ్లి రెండూ తిరుపతిలోనే కావడం విశేషం. సొంతం అంటూ కెరీర్ ను ప్రారంభించిన నమిత.. ఈ నెల 24న తిరుపతిలో వీరేంద్ర చౌదరికి సొంతం అవుతోందన్న మాట. సింపుల్ గా ఉన్నా.. ఒకే వెడ్డింగ్ కార్డ్ లో రెండు ఈవెంట్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ ను అందించేశారు ఈ జంట.

    అనేక మంది ప్రముఖులు

    అనేక మంది ప్రముఖులు

    తెలుగు- తమిళ్ సినీ పరిశ్రమల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కానున్నారు. సోషల్‌ మీడియా ద్వారానే నమిత, తన పెళ్ళి కబురుని అందరికీ తెలియజేసింది. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని చెబుతోంది నమిత.

    "సొంతం" సినిమాతో

    తెలుగులో 'సొంతం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, వెంకటేష్‌తో 'జెమిని', బాలకృష్ణతో 'సింహా' తదితర సినిమాల్లో నటించిన విషయం విదితమే. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితమయ్యింది నమిత. మొత్తానికి ఇన్నాళ్ళకి నమిత సెటిల్ అయిపోతోందన్నమాట .

    English summary
    Namitha, the sexy siren of South Cinema has been trying hard to survive the competition after her debut in Telugu. She migrated to Tamil Cinema and acquired great success and fan following there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X