వెంకటేష్ 'నమో వెంకటేశ' ఆడియో రిలీజ్ విశేషాలు
వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అయిన 'నమో వెంకటేశ' చిత్రం ఆడియో విడుదల నిన్న(జనవరి ఐదు) బ్యాంకాక్ లో జరిగింది. వెంకటేష్ ఆడియాను విడుదల చేసి తొలి క్యాసెట్ ను త్రిషకు అందించారు. ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ బ్యాంకాక్ లో జరుగుతోంది..అందుకే అక్కడే ఫార్మల్ గా ఆడియోను లాంచ్ చేసారు. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ చిత్రం ఆడియోను మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ..బ్యాంకాక్ లో ఆడియోను రిలీజ్ చేయటం ప్రత్యేకమైన అనుభూతికి గురిచేస్తోందని అన్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ చిత్రం పాటలు టాప్ గా నిలుస్తాయన్నారు. ముఖ్యంగా డింగ్ డింగ్, సౌందర్య..సౌందర్య అనే పాటలు ఛాట్ బస్టర్స్ గా నిలుస్తాయన్నారు. త్రిష మాట్లాడుతూ..వెంకటేష్ తో తాను చేసిన తొలి చిత్రం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మాదిరిగా ఈ నమో వెంకటేశ కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ..ఈ చిత్రం తన కెరీర్ లో ఓ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు గా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో పాటలను లావిష్ గా విజువల్ గా బావుండే లొకేషన్స్ లో చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ పంక్షన్ కు భార్గవి యాంకర్ గా చేసింది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











