హిట్ అయ్యినా ఫట్ అయినా అంతా ఫ్రేక్షకులదే!
రికార్డ్ కలెక్షన్, బాక్సీఫీస్ బొనాంజా అనే హంగామాకు దూరంగా ఉండే నటుడు వెంకటేష్. సినిమా రిలీజ్ అయ్యాక అది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. దాన్ని హిట్ చేసినా ఫట్ చేసినా వారే. అందుకే నేనెప్పుడూ టెన్షన్ కు గురికాను" అని ఆయన అంటున్నారు. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'నమో వెంకటేశ" చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ముంగిపు దశలో వుంది.
నమోవెంకటేశ' టైటిల్ నా పేరు మీద అనుకోకుండా అలా కుదిరింది. ప్రత్యేకంగా పెట్టిందికాదు. కథలో పాత్రరీత్యా చాలా అమాయకుడు. ఎవరేమిచేసినా భగవంతుడు చూసుకుంటాడనుకునే నైజం. అలా అని ఏమీ తెలియనితనంకాదు. కొన్ని సార్లు మేథావిగా ప్రవర్తిస్తాడు. మరోవైపు అతనికి లవ్‌ట్రాక్‌కూడా నడుస్తుంది.
ఈ చిత్రం మాస్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ బ్రహ్మానందంతోపాటు అతని స్నేహితులుచేసే సందడి చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. శ్రీనువైట్లతో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నా. అది ఇప్పటికి కుదిరింది. నాకు కామెడీ అంటే ఇష్టం. శ్రీనుబాగా తీస్తారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తరహాలో అలరిస్తుంది. అది కూడా సరికొత్త స్టైల్‌లో ఉంటుందని ఓ ఇంటర్వ్యూ సందర్బంగా తెలిపారు.


Click it and Unblock the Notifications











