twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నమో వెంకటేశ' గ్యారెంటీ ఘనవిజయం

    By Srikanya
    |

    గతంలో సంక్రాంతికి విడుదలైన 'కలిసుందాం..రా', 'లక్ష్మీ' చిత్రాల మాదిరిగానే 'నమో వెంకటేశ' సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని వెంకటేష్‌ చెప్పారు. వెంకటేష్‌, త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన 'నమో వెంకటేశ' చిత్రాన్ని 320 ప్రింట్లతో ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు రాము, గోపి, అనీల్‌ మీడియాకు తెలియచేసారు. అలాగే ఈ 'నమో వెంకటేశ' చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అంశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సంకాంత్రి పండుగకి విందు భోజనం లాంటి సినిమా 'నమో వెంకటేశ'ను అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని శ్రీను వైట్ల చెప్పారు.

    ఇక ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిక్వాలిజం చేస్తూ కనపడతారు. అతను ప్యారిస్ లో తెలుగు వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లతాడు. అక్కడ బ్రహ్మానందం కలుస్తాడు. అతని మేనకోడలు త్రిష. ఇక వీరిని ఆహ్వానించి, అక్కడ పోగ్రామ్ లు చూసే ఆర్గనైజర్ గా బ్రహ్మానందం బిల్డప్ లు ఇస్తూ వెంకటేష్ తో ఆడుకుంటాడు. పూర్తి స్ధాయి కామిడీ పండిస్తాడు. బ్రహ్మానందం ప్యారిస్ ప్రసాద్ అనే పాత్ర చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని టోటల్ సినిమాలో వెంకటేష్ కున్నంత రోల్ బ్రహ్మానందంకు ఉంటుంది.

    ముఖ్యంగా సెకెండాఫ్ లో బ్రహ్మానందం, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయని,రెగ్యులర్ గా శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే త్రాగుడు సీన్ కూడా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా వెంకటేష్ మరో సూపర్ హిట్ కు రెడీ అవుతున్నాడని అంతటా వినపడుతోంది. సంక్రాతి రోజున రిలీజ్ చేసి నవ్వులు పండించనున్నారు. డి సురేష్‌ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మురెళ్ల.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X