ఫారెన్ ట్రిప్ నుంచి వెంకీ-త్రిష
'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత మరోసారి హీరో వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం తొలి షెడ్యూల్ యూరప్ లో పూర్తి చేసుకుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, ఆచంట గోపీనాథ్, ఆచంట రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యూరప్ లోని నార్త్ అట్లాంటిక్ ఐలాండ్ అయిన ఐస్ ల్యాండ్ లో వెంకటేష్, త్రిషపై రెండు పాటలను చిత్రీకరణ జరిపిన చిత్రయూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది. ఇక్కడే తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిలాక్విస్ట్ గా నటించబోతున్నారనీ, ఈ పాత్ర కోసం ఆయన ఇటీవల తగిన శిక్షణ కూడా తీసుకున్నారనీ తెలుస్తోంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. 2010 సంక్రాతి రిలీజ్ గా 'నమో వెంకటేశ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
namo venkatesa trisha sreenu vaitla anil sunkara achanta gopinath achanta ram gopi mohan నమోవెంకటేశ వెంకటేష్ త్రిష గోపి మోహన్ శ్రీను వైట్ల అనీల్ సుంకర్ ఆచంట గోపీనాథ్ ఆచంట రామ్


Click it and Unblock the Notifications