చిరు ఫ్యాన్స్‌పై కేసు కొట్టివేత : వదిలేశామన్న రాజశేఖర్
హైదరాబాద్ : చిరంజీవి అభిమానులపై జీవితరాజశేఖర్ దంపతులు వేసిన కేసును నాంపల్లి కోర్టు గురువారం కొట్టి వేసింది. దాడి చేసిన వారిని గుర్తు పట్టలేమని రాజశేఖర్, జీవిత కోర్టుకు వెల్లడించడంతో ఈ కేసును క్లోజ్ చేసారు. దీంతో గత కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తున్న ఈకేసుకు తెరపడ్డట్లయింది.
కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ....ఇక ఈ కేసును కొనసాగించడం ఇష్టం లేదని, ఈ కేసు కారణంగా తమపై దాడి చేసిన వారి ఫ్యామిలీలు ఇబ్బందులు పడుతున్నారనే దయతో వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నామని, నిందితులను గుర్తుపట్టడం కష్టమని కోర్టుకు వెల్లడించినట్లు తెలిపారు.

మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమంలో 2008లో ఈ దాడి చోటు చేసుకుంది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జీవిత రాజశేఖర్‌లు చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన కొందరు వారు ప్రయాణిస్తున్న కారును పంజగుట్ట ప్రాంతంలో అడ్డగించి ధ్వంసం చేసారు. ఈ ఘటనలో రాజశేఖర్ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సెక్షన్లు 147, 148, 324, 327, 341, 506 కింద నిందుతులపై కేసు నమోదు చేశారు. వీటిలో హత్యాయత్నం కేసు కూడా వుంది.
తనపై దాడి చేసింది చిరంజీవి అభిమానులే అంటూ రాజశేఖర్ కోర్టు కెక్కారు. దీంతో కోర్టు పై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది. అప్పటి నుంచి కేసు కోర్టులో కొనసాగుతోంది. ఆ తర్వాత నుంచి జీవితరాజశేఖర్, చిరంజీవి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో జీవితరాజశేఖర్ పలు సందర్భాల్లో చిరంజీవిపై మాటల దాడి చేసారు.


Click it and Unblock the Notifications











