డబ్బు కట్టకుంటే హీరో నవదీప్‌కు 3నెలల జైలు
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ తాగి డ్రైవ్ చేస్తూ ఆ మధ్య పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అడ్డగించిన పోలీసులపై కూడా నోరు పారేసుకున్నాడు ఈ హీరో. ఈ మేరకు 2010లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషనల్లో నవదీప్‌పై కేసు నమోదైంది. అందుకు సంబంధించిన కేసు తాజాగా బుధవారం విచారణకు వచ్చింది. విచారణ అనంతరం నవదీప్ చేసిన తప్పుకు రూ. 8 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. జరిమాన కట్టని పక్షంలో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
తేజ పరిచయం చేసిన హీరోల్లో ఉదయ్ కిరణ్, నితిన్ తర్వాత ఎంతో కొంత పేరు తెచ్చుకున్న హీరో నవదీప్. 'జై'తో నిరాశాజనకంగా కెరీర్ ఆరంభించిన నవదీప్‌కు 'గౌతం ఎస్.ఎస్.సి.' సినిమా కాస్త ఊపిరినిస్తే, కృష్ణవంశీ తీసిన 'చందమామ' ప్రాణం పోసింది. అయితే వాటి తర్వాత అతను హీరోగా చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అల్లు అర్జున్ సినిమా 'ఆర్య 2'లో యాంటీ హీరోగా తన నటనతో మెప్పించినా ఎందుకనో అతడికి హీరోగా సరైన అవకాశాలు రాలేదు.
'ఓం శాంతి', 'యాగం', 'ఆకాశమే హద్దు', 'ముగ్గురు' సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఆఖరుకి సిద్ధార్థ్ సినిమా 'ఓ మై ఫ్రెండ్'లో సెకండ్ హీరోగా చేసినా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అయినప్పటికీ అతడు అడపాదడపా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అదీ వివాదాల ద్వారా. ఓసారి తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ అతను ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్స్‌తో గోదావరిలో విహారానికి వెళ్లి నది మధ్యలో పడవ ఆగిపోవడంతో విషయం బయటకు పొక్కింది.
ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ పబ్‌వద్ద ఇద్దరు కుర్రాళ్లను కొట్టినట్లు అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నవదీప్ మైత్రి అనే చిత్రంలో నటిస్తున్నాడు. నవదీప్ సరసన సదా హీరోయిన్‌గా చేస్తోంది. రాజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా వికాస్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











