దాసరి నారాయణరావు కుమారుడికి అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు తారక్ ప్రభుకు నాంపల్లి కోర్టు నుండి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భరణం చెల్లించడం లేదని తారక్ ప్రభు భార్య సుశీల కోర్టును ఆశ్రయించడంతో ఈ వారెంట్ జారీ అయింది.
ఈ కేసుకు సంబంధించి పలుమార్లు తారక్ ప్రభు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. భరణం విషయంలో తారక్ ప్రభు, అతని భార్య సుశీల మధ్య చాలా కాలం కోర్టు కేసు నడుస్తోంది.

గతంలో ఫ్యామిలీ కోర్టు సుశీలకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభు రికారల్ పిటీషన్ దాఖలు చేసి భరణం రద్దయ్యేలా ఉత్తర్వులు పొందారు. అయితే సుశీల అంతటితో ఆగకుండా పైకోర్టులకు వెళ్లింది. ఇలా ఈ భరణం వివాదం గత కొంత కాలంగా సాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











