twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద స్టార్ అయితే ఏంటి? మహేష్ బాబు కోర్టుకు రావాల్సిందే!

    మహేష్ బాబును ‘శ్రీమంతుడు’ సినిమా కోర్టు చిక్కులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరోసారి మహేష్ బాబుకు సమన్లు జారీ అయ్యాయి.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును 'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన కోర్టు చిక్కులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరోసారి మహేష్ బాబుకు సమన్లు జారీ అయ్యాయి.

    మహేష్ బాబు పెద్ద స్టార్ అయినందున వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని పెట్టుకున్న పిటీషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. మహేష్ బాబు కోర్టు హాజరు కావాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది.

    ఇంకా తెగని శ్రీమంతుడు కేసు

    ఇంకా తెగని శ్రీమంతుడు కేసు

    'శ్రీమంతుడు' చిత్రంపై నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను తన నవలను బేస్ చేసుకుని తీశారని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

    మళ్లీ విచారణ

    మళ్లీ విచారణ

    ఈ కేసుకు సంబందించి గతంలో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేస్తూ, చిత్ర హీరోగా ఉన్న మహేష్ బాబు కూడా కోర్టు విచారణకు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

    గతంలో నిలిపివేత

    గతంలో నిలిపివేత

    ఈ కేసుకు సంబంధించి గతంలో..... మహేష్ బాబు, కొరటాల శివ కోర్టు హాజరు కావాలని ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించి నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే గడుపు ముగియడంతో నాంపల్లి కోర్టు నుండి మళ్లీ సమన్లు అందాయి.

    ఆ కథ నాదే..

    ఆ కథ నాదే..

    2012లో స్వాతి మాసపత్రికలో తాను 'చచ్చేంత ప్రేమ' అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌కు చెందిన రచయిత ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించారు.

    కాపీ రైట్ చట్టం

    కాపీ రైట్ చట్టం

    కాపీరైట్‌ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని రచయిత పోరాడుతున్నారు.

    మేము సినిమా తీసేలోపే

    మేము సినిమా తీసేలోపే

    తానే రాసిన చచ్చేంత ప్రేమ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అవ్వడం.. సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయని శరత చంద్ర తెలిపారు.

    ఎవరూ న్యాయం చేయలేదు

    ఎవరూ న్యాయం చేయలేదు

    ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిలంతోపాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిశాము. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాలా మరో రచయితకు భవిష్యత్ తో ఇటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని రచయిత శరత్ చంద్ర గతంలో మీడియాతో అన్నారు.

    ఎంతవరకైనా వెళతాం

    ఎంతవరకైనా వెళతాం

    ఈ విషయమై న్యాయం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని, తమ కథను కాపీ కొట్టడం విషయంలో 'శ్రీమంతుడు' దర్శకనిర్మాతల్ని సంప్రదించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం అటుంచి తమను ఎన్నో మాటలన్నారని శరత్ చంద్ర వాపోయారు.

    English summary
    Nampally Court has issued summons to Mahesh Babu and the entire movie unit of Srimanthudu to present before the Court. As the case filed by Sharath Chandra a novelist for alleged plagiarism of his story-line.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X