దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్: వెంకటేష్, రానాతో సహా వాళ్లపై కేసు నమోదు.. పూర్తి వివరాలివే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఈ కుటుంబ పెద్ద దగ్గుబాటి రామానాయుడు సుదీర్ఘ కాలం పాటు వందల సంఖ్యలో సినిమాలను నిర్మించి మూవీ మొఘల్ అనిపించుకున్నారు. ఆయన తర్వాత సురేష్ బాబు నిర్మాతగానూ, వెంకటేష్, రానా, అభిరామ్‌లు హీరోలుగానూ టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అలాంటి ఈ ఫ్యామిలీ కొన్నేళ్ల క్రితమే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీలోని కొందరిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. అసలేమైందో మీరే చూసేయండి!
Recommended Video

డెక్కన్ కిచెన్ కూల్చివేతతో:హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో డెక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. దాన్ని దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన స్థలంలోనే నిర్మించారు. అయితే, దీని లీజు పూర్తైనా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌ను రన్ చేస్తున్నారని దగ్గుబాటి హీరోలు కంప్లైంట్ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారు. ఇది అప్పట్లో సెన్సేషన్ అయింది.

బాధితులు కోర్టుకు వెళ్లారు:దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో డెక్కన్ కిచెన్ కూల్చివేయడంతో.. దాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ ఆ వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ కూల్చివేత వల్ల తనకు కోట్ల మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులపైన కూడా కేసులు పెట్టారు.
చీవాట్లు పెట్టిన ధర్మాసనం:నందకుమార్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని.. ఆదివారం అర్జంట్‌గా కూల్చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది.

నాంపల్లి కోర్టులో విచారణ:నందకుమార్ ఇటీవలే సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్‌పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేయడంలో కారకులనై వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థల లీజ్ విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దౌర్జన్యంగా హోటల్‌ను కూల్చివేశారని నందకుమార్ ఆరోపించారు. దీనిపై తాజాగా నాంపల్లి కోర్టు విచారణను జరిపింది.
కేసు నమోదు చేయాలని:నందకుమార్ పిటీషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు డెక్కన్ కిచెన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్‌పై ఐపీసీ సెక్షన్లు 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుతో టాలీవుడ్‌లో కలకలం రేగుతోంది.


Click it and Unblock the Notifications











