మహేష్‌బాబు సినిమాకు నమ్రత దర్శకత్వం?
సినిమా రంగంలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర కాంబినేషన్లు చోటు చేసుకుంటుంటాయి. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు, హీరోయిన్లు కలిసి నటించడం గతంలో మనం చూశాం. అయితే ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. అగ్రహీరోల భార్యలు దర్శకుల అవతారం ఎత్తి తమ భర్తల సినిమాలకే దర్శకత్వం వహించడం లాంటివి అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ దర్శకత్వంలో తన సత్తా చాటుతోంది.
అయితే మన టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఇలాంటి ట్రెండు మొదలు కాలేదు. హీరో రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వంలో వేలు పెట్టినా జనాలు పెద్దగా పట్టించుకుంది లేదు. వీళ్లపై ఔట్ డేటెడ్ ముద్ర పడటమే ఇందుకు కారణం. ఇక యువ స్టార్ హీరోల విషయానికొస్తే.. ఈ ట్రెండు సూపర్ స్టార్ మహేష్ కుటుంబం నుంచి మొదలవుతుందనే వాదన ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం నమ్రత దర్శకత్వంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నమ్రత దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ప్రక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దర్శకత్వంపై తనకు అమితా సక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం గౌతం ఆలన పాలన చూసుకుంటున్న నమ్రతకు కోరిక ఆచరణలో ఆలస్యం అవుతోంది.


Click it and Unblock the Notifications











