మహేష్‌ని, నన్ను మీ ప్రేమే నడిపిస్తోంది మావయ్య.. కృష్ణపై నమ్రత ఎమోషనల్ పోస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ఎన్నో కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల హైదరాబాద్‌లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్సుని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అత్యాధునిక హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా ఏఎంబి సినిమాస్ ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మల్టిప్లెక్స్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కృష్ణ చేతుల మీదుగా

కృష్ణ చేతుల మీదుగా

గచ్చిబౌలి లోని బొటానికల్ గార్డెన్‌లో ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్‌ని నిర్మించారు. ఇందులో మహేష్ బాబు ఒక భాగస్వామి. చాలా రోజులుగా ఏఎంబి సినిమాస్ త్వరలో ప్రారంభం కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాణపనులు పూర్తి కావడంతో డిసెంబర్ 2న సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఏఎంబి సినిమాస్‌ని ప్రారంభించారు. ఈ వేడుకలో మహేష్, నమ్రత దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

మావయ్య ఫోటో షేర్ చేసి

మావయ్య ఫోటో షేర్ చేసి

ఏఎంబి సినిమాస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్ చేశారు. మీ ప్రేమ, మద్దత్తతోనే తాను, మహేష్ ముందుకు సాగుతున్నాం అని నమ్రత పోస్ట్ చేశారు. మా వెన్నుండి నడిపించే శక్తి మీరే, అందుకు ధన్యవాదాలు అంటూ నమ్రత కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేసింది.

 సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు

ఇదిలా ఉండగా నమ్రత సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. మహేష్, నమ్రత కలసి 150 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం నమ్రత ప్రకటించారు. అన్ని సర్జరీలు విజయవంతం అయ్యాయని తెలిపారు. మరోవైపు మహేష్ బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

 మహర్షి చిత్రంతో బిజీగా

మహర్షి చిత్రంతో బిజీగా

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X