బిజినెస్ మ్యాన్ నిర్వాహణ బాధ్యతలు తీసుకొంటున్న మహేష్ భార్య
రాజమౌళి, శ్రీను వైట్ల భార్యలలానే హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఏదో ఒక వ్యాపకంతో బిజీ కావాలని కోరుకుంటోంది. ఇందులో భాగంగా, భర్త అండతో ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వహణ బాధ్యతల్ని తీసుకోవాలని డిసైడ్ అయిందని వాళ్ల సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా మహేష్ నటిస్తున్న 'బిజినెస్ మేన్' సినిమా ఆడియో వేడుకను విదేశాల్లో ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్ల ఆడియోను సంయుక్తంగా ఒకే వేదికపై సింగపూర్లో భారీ లెవెల్లో నిర్వహించనుందని అంటున్నారు.
సుమారు మూడు కోట్ల బడ్జెట్ తో ఈ ఈవెంట్ జరుగుతోందట. పలు భాషలకు చెందిన తారలతో డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమాలను, ఇతర ఎంటర్ టైనింగ్ ప్రోగ్రామ్స్ ను ఈ వేడుకలో ఎరేంజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నమ్రత ఇప్పటికే ప్రారంభించిందని తెలుస్తోంది. మామూలుగా తమిళ సినిమాల ఆడియో ఫంక్షన్లు ఈ మధ్య కాలంలో సింగపూర్లో బాగా జరుగుతున్నాయి. తమిళులతో బాటు తెలుగు, మలయాళ ప్రజలు కూడా ఆక్కడ బాగానే ఉండడంతో సినిమాకు ఒక హైప్ తీసుకురావడం కోసం సింగపూర్ ను వేదికగా ఎంచుకున్నారట!


Click it and Unblock the Notifications











