Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 5 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 6 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 7 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ షాకింగ్ నిర్ణయం.. నమ్రత క్లారిటీ.. ఫ్యాన్స్‌కు ఝలక్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు గతంలో ఎన్నడూలేని విధంగా తన కెరీర్‌ను పీక్స్‌లో పరుగులు పెట్టిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి అందించిన విజయోత్సహంతో ప్రిన్స్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా తర్వాత మహేష్ తీసుకొనే నిర్ణయం ఫ్యాన్స్ షాకిచ్చేలా ఉంది. ఇంతకు ఆయన తీసుకొనే నిర్ణయం ఏమిటంటే..

వరుస సినిమాలతో మహేష్
తాజాగా ఆంగ్ల దినపత్రికతో మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ.. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బిజీగా మారిపోయారు. వరుస షూటింగ్‌లతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్లో తలమునకలై ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 2020లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కొన్ని రోజుల్లో ఈ సినిమా షూట్ పార్ట్ ముగించనున్నారు అని తెలిపారు.

నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తూ
మహర్షి నుంచి నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇలా వరుస షూటింగ్‌లతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయారు. ఆ మధ్య విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చాం. కానీ ఎక్కువగా ఫ్యామిలీతో గడపలేకపోయారు. చిన్నపాటి విహార యాత్రతో సేదతీరలేకపోయారు. అందుకే లాంగ్ బ్రేక్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవాలనుకొంటున్నారు అని నమ్రత పేర్కొన్నారు.

సరిలేరు నీకెవ్వరు తర్వాత లాంగ్ గ్యాప్
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు మూడు నెలలపాటు బ్రేక్ తీసుకొంటారు. జనవరిలో సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత పిల్లలు గౌతమ్, సితారకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నారు. ఆ లాంగ్ బ్రేక్‌లోనే మరో సినిమాకు సిద్ధమవుతారు. ఆ సుదీర్ఘమైన విశ్రాంతి తర్వాత మళ్లీ సరికొత్త ఉత్తేజంతో సినిమా చేస్తారు అని నమ్రత వెల్లడించారు. ఒకవేళ జనవరి తర్వాత మూడు నెలలు అంటే మళ్లీ దసరాకు ప్రిన్స్ కనిపించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

సంక్రాంతి తర్వాత మళ్లీ
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ పూర్తికాగానే భారీగా ప్రచారం నిర్వహించాలని మహేష్ బాబు భావిస్తున్నాడు. ప్రమోషన్స్ ఈ సారి ఎక్కువగా సమయం కేటాయించాలనుకొంటున్నారు. ఆ సమయంలో తన తదుపరి సినిమా గురించి పక్కాగా స్క్రిప్టును సిద్ధం చేసుకొంటారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత కన్నడ దర్శకుడు, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తారనే విషయం మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.