»   » నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్, కారణం అదే.... (ఆశ్చర్యపోయే విషయాలు, ఫోటోస్)

నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్, కారణం అదే.... (ఆశ్చర్యపోయే విషయాలు, ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2005లో వీరి వివాహం జరుగగా ఎంతో అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. నేడు నమ్రత పుట్టినరోజు. 1972 జనవరి 22న జన్మించిన ఆమె 46వ వడిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన భార్యను విష్ చేస్తూ లవ్లీ ట్వీట్ చేశారు.

భార్యపై ప్రేమను ట్వీట్ ద్వారా వ్యక్త పరిచిన మహేష్ బాబు

భార్యపై ప్రేమను ట్వీట్ ద్వారా వ్యక్త పరిచిన మహేష్ బాబు

తన భార్యపై ఉన్న కొండంత ప్రేమను మహేష్ బాబు ట్వీట్ ద్వారా అద్భుతంగా వెల్లడించారు. ‘నువ్వు నాకు ఎంత ప్రత్యేకమో చెప్పడానికి మరో కారనం దొరికింది. హ్యాపీ బర్త్ డే టు మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఫ్యామిలీ ఫోటో పోస్టు చేసిన మహేష్ బాబు

ఫ్యామిలీ ఫోటో పోస్టు చేసిన మహేష్ బాబు

భార్యను విష్ చేయడంతో పాటు తన ఫ్యామిలీ ఫోటోను మహేష్ బాబు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ అభిమానుల నుండి కామెంట్స్ వస్తున్నాయి.

నమ్రత గురించి ఆసక్తికర విషయాలు

నమ్రత గురించి ఆసక్తికర విషయాలు

నమ్రత శిరోద్కర్.... మహేష్ బాబుకు భార్య కాక ముందు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘వంశీ'. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ఆమె పరిచయం ప్రేమగా మారడం, దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

మహేష్ బాబు తర్వాత మెగాస్టార్‌తో మాత్రమే

మహేష్ బాబు తర్వాత మెగాస్టార్‌తో మాత్రమే

మహేష్ బాబుతో ‘వంశీ' సినిమా తర్వాత ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 వచ్చిన ‘అంజి' చిత్రంలో నమ్రత నటించింది. ఆ తర్వాత ఏడాదే మహేష్ బాబుతో ఆమె వివాహం జరుగడంతో సినిమాలు మానేసింది.

న్రమత సినిమాల్లోకి అలా

న్రమత సినిమాల్లోకి అలా

1998లో ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై' సినిమా ద్వారా నమ్రత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. సౌత్ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో రెండు, కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమా మాత్రమే చేసింది.

నమ్రత శిరోద్కర్

నమ్రత శిరోద్కర్

నమ్రత మహారాష్ట్రియన్ ఫ్యామిలీలో పుట్టింది నిజమే కానీ... ఆమె పూర్వీకులు గోవన్ (గోవా ప్రాంతం) మూలాలు కలిగిన వారు. ఇండియాలో ఆమె ఎక్కువ ప్రిఫర్ చేసే హాలిడే ప్రదేశం కూడా గోవానే.

నమ్రత కూడా సినీ వారసత్వమే..

నమ్రత కూడా సినీ వారసత్వమే..

మహేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసత్వం పుచ్చుకున్నట్లే... నమ్రత కూడా తన గ్రాండ్ మదర్, ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్ వారసత్వం పుచ్చుకుంది. స్వాతంత్రానికి ముందు(1938) వచ్చిన బ్రహ్మచారి చిత్రంలో మీనాక్షి నటించింది. నమ్రత అక్కయ్య శిల్ప శిరోద్కర్ కూడా నటిగా ఇంకా కొనసాగుతోంది.

మహేష్ బాబు కంటే వయసులో పెద్ద..

మహేష్ బాబు కంటే వయసులో పెద్ద..

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... నమ్రత వయసులో మహేష్ బాబు కంటే పెద్ద. నమ్రత మార్చి 1, 1972లో జన్మించింది. మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో జన్మించారు. అంటే ఇద్దరి మధ్య మూడేళ్లకుపైగా వయసు తేడా ఉంది.

 మిస్ ఇండియా

మిస్ ఇండియా

మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఇండియా తరుపున మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొన్నప్పటికీ విశ్వ సుందరి కిరీటం దక్కించుకోలేక పోయింది. ఆ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది జరిగిన మిస్ ఏసియా పసిఫిక్ పోటీల్లో పాల్గొన్న నమ్రత ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

తొలి సినిమా రిలీజ్ కాలేదు

తొలి సినిమా రిలీజ్ కాలేదు

మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న తర్వాత నమ్రతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన తొలి సినిమా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ‘పురబ్ కి లాలియా పశ్చిమ్ కి చాలియా'. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

నమ్రత తొలి విజయం

నమ్రత తొలి విజయం

‘వాస్తవ్' మూవీ నమ్రత్ కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

పెళ్లికి అభ్యంతరాలు

పెళ్లికి అభ్యంతరాలు

మహేష్ బాబు-నమ్రత పెళ్లికి చాలా అభ్యంతరాలు వచ్చాయి. నమ్రత మహేష్ కంటే వయసులో పెద్ద కావడం, తెలుగు అమ్మాయి కాక పోవడం, ఇతర సామాజిక కారణాలతో పెళ్లికి మహేష్ బాబు సైడ్ నుండి అభ్యంతరాలు ఏర్పడటంతో..... పెద్దలను ఎదిరించిన మహేష్ బాబు ముంబైలో నమ్రతను పెళ్లాడారు.

అందమైన కుటుంబం

అందమైన కుటుంబం

పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు మానేసింది. ప్రస్తుతం నమ్రత-మహేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు. అటు ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు, తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ మహేష్ బాబు ఫుల్ సపోర్టుగా ఉంటోంది నమ్రత.

English summary
Mahesh Babu might have earned his superstardom by beating baddies in his films among other things on screen, but off it, he often shows his softer side, especially with his family. The occasion being Namrata’s birthday, Mahesh’s words for his wife was even more adorable, calling her his ‘love’, ‘best friend’ and describing how special she was to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu