మిడ్ నైట్ పార్టీ హోస్ట్ చేసిన మహేష్ భార్య నమ్రత (ఫోటోస్)
Recommended Video
మహేష్ బాబు సినిమా విడుదల రోజు ఆయనకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు నమ్రత శిరోద్కర్. అందుకే మహేష్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఆమె ఇష్టపడరు. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి సినిమాకు ఎలాంటి టాక్ వస్తోంది, రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు విశ్లేషిస్తూ కాస్త ఒత్తిడిలో ఉంటారట.
'మహర్షి' సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో న్రమత స్ట్రెస్ ఫ్రీ అయ్యారు. శుక్రవారం ఆమె తన స్నేహితులతో కలిసి 3 సార్లు 'మహర్షి' మూవీ చూశారట. నిన్న అర్ధరాత్రి వరకు తమ ఎఎంబి థియేటర్లో వరుస షోలు చూస్తూ ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారట.

స్నేహితులతో కలిసి పార్టీలో
శుక్రవారం అర్థరాత్రి చివరి షో ముగిసిన అనంతరం నమ్రత తమ ఇంటికి చేరుకుని స్నేహితులతో కలిసి పార్టీలో మునిగి తేలారు. ఈ పార్టీలో దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య పిల్లతో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వరుసగా మూడు షోలు చూసిన నమ్రత
‘మహర్షి' మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ అందించిన వంశీ పైడిపల్లికి థాంక్స్ అంటూ... వారితో కలిసి దిగిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మహర్షి చిత్రాన్ని 3 సార్లు చూసినట్లు నమ్రత వెల్లడించారు.

బంధువులు, స్నేహితులు కూడా
మహేష్ బాబు 25వ మూవీ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి నమ్రత తరుపు బంధువులు, మరికొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. వారితో కలిసి దిగిన ఫోటోలను సూపర్ స్టార్ వైఫ్ అభిమానులతో పంచుకున్నారు. మహేష్-నమ్రత దంపతులు గతంలో ఎన్నడూలేనంత ఆనందంగా కనిపించారు.

పిల్లల హడావుడి
పిల్లలు, పెద్దలు అంతా కలిసి మిడ్ నైట్ పార్టీలో సందడి చేశారు. గౌతమ్, సితారతో పాటు వంశీపైడిపల్లి కూతురు, మరొకొందరు కిడ్స్ ఈ సెల్రేషన్స్‌లో సందడి చేశారు. నమ్రత షేర్ చేసిన ఈ హ్యాపీ మూమెంట్స్ చూసి మహేష్ అభిమానులు సైతం పులకించి పోతున్నారు.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











