సీక్రెట్ టాటూ గుట్టు విప్పిన నమ్రత.. మహేష్ బాబుతో లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బయట ఎంత సూపర్ స్టార్ అయినా కూడా ఇంట్లో అడుగుపెట్టగానే అవన్నీ మర్చిపోతాడు. కేవలం ఒక తండ్రి, భర్త అనే హోదాలో తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఇక సతీమణి నమ్రత కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె టాటూతో పాటు మహేష్ తో మొదటిసారి ప్రేమలో పడ్డ విషయాన్ని కూడా చెప్పింది.

టాటూలో ఆ పేర్లు..

టాటూలో ఆ పేర్లు..

ఇటీవల నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో నెటీజన్స్ తో చిట్ చాట్ చేసింది. ఏ మాత్రం సందేహించకుండా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అయితే ఒక నెటీజన్ ఆమె టాటూ గురించి ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉందని చెప్పగా చేయిపై వేసుకున్న టాటూని చూపించారు. అందులో మహేష్ బాబు పేరుతో పాటు గౌతమ్, సితారా పేర్లు కూడా ఉన్నాయి.

 లవ్ స్టోరీ అక్కడే మొదలైంది..

లవ్ స్టోరీ అక్కడే మొదలైంది..

ఇక అనేక రకాల విషయాలపై స్పందిస్తూ.. మహేష్ బాబుతో తన లవ్ స్టోరీ గురించి కూడా నమ్రత మొదటిసారి బయటపెట్టింది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో మొదటిసారి మహేష్ బాబుతో నమ్రత కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా జ్ఞాపకాలు తను ఎప్పటికి మరచిపోలేనని చెప్పిన నమ్రత మొదట న్యూజిలాండ్ లో జరిగిన షూటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని చెప్పారు.

ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?

ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?

ఇక ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయంపై వివరణ ఇస్తూ .. అన్ని విషయాలు తనకు గుర్తు ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో మాత్రం తనకి కాస్త కన్ఫ్యూజన్ ఉందని వివరణ ఇచ్చింది. ఇక భవిష్యత్తులో మరోసారి మహేష్ బాబుతో నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. బహుశా అది జరగకపోవచ్చని అన్నారు.

Recommended Video

Mahesh Babu & Sitara's Cute Video Shared By Namratha
 మహేష్ కథల విషయంలో..

మహేష్ కథల విషయంలో..

మరొక ముఖ్యమైన విషయం గురించి కూడా నమ్రత వివరంగా తెలిపింది. ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉంది. మహేష్ బాబు కథల విషయంలో నమ్రతదే పై చేయి అని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మహేష్ ఓకే చేస్తాడని టాక్ ఉంది. అయితే సినిమా కథల సెలెక్షన్స్ విషయంలో పూర్తి నిర్ణయం మహేష్ బాబుదే అని ఒక్క మాటతో నమ్రత ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇక తనకు ఇష్టమైన హీరో కూడా మహేష్ బాబు అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X