మహేష్ తో ప్రేమ ఎలా మొదలైందంటే...: నమ్రత
ఆ తర్వాత... సరే, షూటింగ్ మొదలైంది. న్యూజిలాండ్ వెళ్లాం. నేనే ఓరోజు ఈ ఇబ్బందిని తొలగించాలనుకుని తనతో కూర్చుని కాసేపు మాట్లాడా. మాట్లాడాక తెలిసింది... తను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని, విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని, తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమని, తనతో కూర్చుంటే టైం అసలు తెలీదని! తను కూడా కొన్నిరోజులకి ఫ్రీగా ఫీలయ్యి, మాట్లాడడం మొదలెట్టారు. మెల్లగా కలిసి, డిన్నర్‌లకి, సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ఇద్దరి స్నేహం అలా మొదలై, ఒకరినొకరు ఇష్టపడేదాకా వచ్చింది అని చెప్పుకొచ్చారు.
ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మొదట ఎవరికి వచ్చింది అనే విషయం వివరిస్తూ...నమ్రత....ఒకరికని లేదు ఇద్దరిదీ. ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఏ లెవెల్ దాకా వెళ్లిందంటే... ఒకరినొకరు విడిగా ఉండడం చాలా కష్టమని తెలుసుకున్నాం. అయితే, ఆ టైంలో తన కెరీర్‌లో తను, నా కెరీర్‌లో నేను చాలా బిజీగా ఉండడంతో కలవడం చాలా కష్టమయ్యేది. అలా అని కలవకుండా ఉండలేకపోయాం. ఇక అప్పుడు ఇద్దరికీ అర్థమైంది... దీనికి మార్గం పెళ్లేనని! అందుకని నా ఫిల్మ్ ఎసైన్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి ఇంట్లోవాళ్లకి చెప్పాం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












