Guntur Kaaram: సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్స్ కోసం గుంటూరు కారం స్పెషల్ షో.. ఎక్కడో తెలుసా?
మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం.. జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా మహేశ్ బాబు సరసన శ్రీలీల నటించగా.. మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పిరియన్స్ చేసింది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రత్యేక షోలను మహిళల కోసం నమ్రత ఫ్రీగా వేయనున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఒక్కసారిగా ఈ ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే మహేష్ బాబు ఇప్పటి వరకు కనిపించినంత మాస్ రోల్ లో నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మహేష్ క్లాస్, మాస్ అన్ని కోణాల్లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది.

మహేష్ ని ఒక మాస్ కమర్షియల్ రోల్ లో చూసి అభిమానులకు చాలా ఏళ్ళు అవుతందనే చెప్పాలి. ఇక ఇప్పుడు గుంటూరు కారం ఒక పక్కా కమర్షియల్ ఫార్మేట్ లో వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో జనవరి 12న ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతే కాదు.. అవి ఫుల్ కూడా అయిపోతున్నాయి. కాగా మహేష్ కి లేడీస్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేశ్ లేడీ ఫ్యాన్స్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. కానీ అది కుదరక చాలామంది వెనుతిరుగుతుంటారు. సినిమా రిలీజ్ అంటే హంగామా అంతా ఇంతా కాదు.. ఫస్ట్ డే అయితే ఈలలు, కేకలు.. పేపర్లు చినిగిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇక వీటిలో లేడీ ఫ్యాన్స్ వెళ్లి చూడాలంటే కష్టమే. ఇక ఆ లేడీ ఫ్యాన్స్ బాధని గమనించిన నమ్రత.. వారికోసం ఓ ప్రత్యేక షో వేయిస్తున్నారు. కేవలం లేడీస్ కి మాత్రం ఆ షో పడబోతోందని తెలుస్తోంది.

ఈ విషయం తెలియజేస్తూ నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ వేయగా అది వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్పెషల్ ఎక్కడ..? ఎప్పుడు పడుతుందంటే.. విజయవాడ గాంధీ నగర్‌లోని రాజ్ థియేటర్ లో ఈ స్పెషల్ షోని నమ్రత ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రాజ్ థియేటర్ లో గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో కేవలం మహిళలకు మాత్రం స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుంది.
మరి మహేష్ బాబు సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని కలలు కంటున్న లేడీ ఫ్యాన్స్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని నమ్రత పేర్కొంది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందమంది లేడీ ఫ్యాన్స్.. ఇలా ప్రతి సెంటర్ లో ఏర్పాటు చేయించండి ప్లీజ్ అంటూ నమ్రతకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి నమ్రత అన్ని సెంటర్స్ లో ఏర్పాటు చేయాలంటే.. కష్టమేనని కొంతమంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











