మహేష్ బాబు సినిమా నమ్రత అస్సలు చూడదంట.. కారణం ఇదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ డే ఫష్ట్ షో చూడాలని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో ఉండే ఫ్యాన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
కేవలం అభిమానులు మాత్రమే కాదు... మహేష్ పాదర్ కృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా తొలిరోజు షో చూడటంతో పాటు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం తన భర్త నటించిన సినిమాలు అస్సలు చూడదంట.

మహేష్ సినిమా తొలి రోజు చూడటం అంటే... తాను చాలా ఒత్తిడికి గురవుతానని ఆమె ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫస్ట్ డే మహేష్ షో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే తాను మాత్రం ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటానని, ఈ చిత్రం మహేష్ గత చిత్రం కంటే పెద్ద హిట్ కావాలని ప్రేయర్ చేస్తూ ఉంటానని తెలిపారు.
తాను టెన్షన్ పడుతుంటే... మహేష్ వచ్చి అలా టెన్షన్ పడటం ఎందుకు? ఎలా జరిగేది అలా జరుగుతుంది అంటూ ధైర్యం చెబతారట. ఆయన ఎంత చెప్పినా సినిమా రిజల్ట్ బయటకు వచ్చే వరకు తనలో టెన్షన్ అలాగే ఉంటుందని నమ్రత చెప్పుకొచ్చారు.
నమ్రత ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు ప్రొఫెషనల్ అసైన్మెంట్స్, సినిమా వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె అన్నీ అలా మేనేజ్ చేస్తుంది కాబట్టే మహేష్ సాఫీగా ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చేసుకుంటూ దూసుకెళుతున్నారు.
మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' విషయానికొస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేయడంతో పాటు పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.


Click it and Unblock the Notifications











