సినిమాల్లోకి గౌతమ్ ఎంట్రీ - జ్యువెలరీ యాడ్ రెమ్యునరేషన్.. క్లారిటీ ఇచ్చేసిన సితార.. ఏం చెప్పిందంటే?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు - నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిన్నారి అప్పుడే తండ్రి గర్వించే స్థాయికి ఎదుగుతూ పోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పుల్ క్రేజ్ దక్కించుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై.. తొలిసారిగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. అయితే దీనీ కోసం తాను అందుకున్న రెమ్యునరేషన్ ను ఏం చేసిందో తెలిపింది సితార. అలాగే సితార, గౌతమ్.. సినిమాల్లోకి వచ్చే విషయమై కూడా నమ్రత మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
ఫుల్ క్రేజ్.. సితార.. ఇప్పుడీ స్టార్ కిడ్ పేరు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ తో పాటు పలు సోషల్ మీడియా అకౌంట్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ తన మల్టీ టాక్సింగ్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ పాప మంచి డ్యాన్సర్ కూడా. చాలా సార్లు అదిరిపోయే ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ డ్యాన్స్ వేస్తూ సందడి చేస్తుంటుంది. తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

సినిమాల్లోనూ.. సినిమాలంటే మంచి ఆసక్తి ఉన్నట్లు తన చర్యలతో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది సితార. ఆ మధ్యలో 'ఫ్రోజెన్ 2' సినిమా తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. 'సర్కారు వారి పాట'లో పెన్ని సాంగ్ లో తండ్రితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. తన డ్యాన్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో సినీ ప్రియుల్ని, మహేశ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో అదిరిపోయే సమాచారం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మహేశ్ - రాజమౌళి చేయబోయే పాన్ వరల్డ్ సినిమాలోనూ ఆమె నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంతో ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. ఇందులో సితార-అభయ్ రామ్ అక్కాతమ్ముళ్లుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ సితార పాప ఓ అరుదైన ఘనత అందుకున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై.. తొలిసారిగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చి హాట్ టాపిక్ గా నిలిచాయి. చిన్న వయసులోనే ఇంతటి ఘనత అందుకున్నందుకు ఆమెపై అభిమానులందరూ ప్రశంసించారు. అలాగే మహేశ్ కుడా తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు.

అయితే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అవ్వడంపై సితార ఎంత రెమ్యునరేషన్ తీసుకుందా అని చర్చలు మొదలయ్యాయి. అయితే ఇందుకుగాను ఆమె రూ. కోటి రూపాయలు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు జోరుగా వచ్చాయి. యాడ్ కు సంబంధించిన వీడియో ఈ నెల 19న రిలీజ్ కానుంది. అయితే తాజాగా రెమ్యునరేషన్ పై సితార మాట్లాడింది. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చారు? అమ్మకు ఇచ్చారా? నాన్నకు ఇచ్చారా? అని అడగగా.. చారిటీ ట్రస్ట్ కు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఇది తెలుసుకుంటున్న అభిమానులు తండ్రికి తగ్గ కూతురు అని ప్రశంసిస్తున్నారు. "జ్యువెలరీ యాడ్‌లో నటించడం హ్యాపీగా ఉంది. షూట్ ఎంతో సరదాగా జరిగింది. అందరూ నాకు మద్దతుగా నిలిచారు. నా ఫొటోలను న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించిన రోజైతే.. సంతోషంగా కన్నీళ్లు వచ్చాయి. నాన్నను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాను. సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంది. నా మొదటి పారితోషికాన్ని సేవా కార్యక్రమాల కోసం ఇచ్చాను" అని సితార చెప్పింది.
మహేశ్ కూడా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతోమంది పేద చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార నడుస్తుండటం ఎంతో గొప్ప విషయమని అభిమానులు అంటున్నారు.

సితార సినిమాల్లోకి వచ్చే విషయమై నమ్రత మాట్లాడుతూ.. "సరైన మార్గదర్శకులు మంచి వ్యక్తుల మద్దతు ఉంటే ఇండస్ట్రీ ఎంతో అందమైన ప్రదేశం. కానీ ఇక్కడ చాలామందికి చిత్ర పరిశ్రమ అంటే మంచి అభిప్రాయం లేదు. మా పిల్లలను మేం ప్రోత్సహిస్తూనే ఉంటాం. సితార సినిమాల్లోకి వస్తానంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అతడు సినిమాల్లోకి రావడానికి దాదాపు ఎనిమిదేళ్ల వరకు పట్టే అవకాశం ఉంది. సితార నటించిన జ్యువెలరీ యాడ్‌ను మహేశ్ కు ఎంతో బాగా నచ్చింది. రిపీట్ మోడ్‌లో చూస్తూనే ఉన్నారు. ఇది ఓ ఎమోషనల్ మూమెంట్" అని తెలిపారు.


Click it and Unblock the Notifications











