ఆడవాళ్ళ విషయంలో ఆ హీరో.. మహేష్‌ గురించి ముందు ఆయనకే చెప్పా.. నమ్రత

Recommended Video

'Sanjay Dutt Is Warm, Protective' Says Namrata Shirodkar || Filmibeat Telugu

మహేష్ బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. పెళ్ళికి ముందు బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించిన ఆమె.. మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ వ్యవహారాలు, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన నమ్రత తన బాలీవుడ్ కెరీర్ గురించి, హీరో సంజయ్ దత్ గురించి కొన్ని విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇంతకీ నమ్రత చెప్పిన ఆ సంగతులేంటి? వివరాల్లోకి పోతే..

 ఏడేళ్ల ప్రయాణం.. సంజయ్ దత్‌తో

ఏడేళ్ల ప్రయాణం.. సంజయ్ దత్‌తో

పెళ్లికి ముందు నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ లో ఏడేళ్ల సినీ జర్నీ కొనసాగించింది. ఆ ప్రయాణంలో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ తో మంచి రిలేషన్‌షిప్ కొనసాగించింది. ఆయనతో కలిసి వాస్తవ్, దాని సీక్వల్ మూవీ హత్యార్ చేసింది నమ్రత. ఈ నేపథ్యంలో ఇటీవలే జరిగిన సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది నమ్రత.

 ఆయనకు 60 ఏళ్ళు.. కానీ

ఆయనకు 60 ఏళ్ళు.. కానీ

ప్రస్తుతం సంజయ్ దత్‌ వయసు 60 ఏళ్ళు. కానీ నమ్రత అతనికి 60 ఏళ్ళు అంటే నమ్మలేక పోతున్నాని అంటోంది. తన దృష్టిలో సంజయ్ దత్ ఎప్పుడూ చిన్న పిల్లాడే అని పేర్కొంటూ ఆయనలో ఓ జెంటిల్‌మెన్ దాగి ఉన్నాడని సంజయ్ పై పొగడ్తల వర్షం కురిపించింది నమ్రత శిరోద్కర్.

ఆడవాళ్ళ విషయంలో సంజయ్..

ఆడవాళ్ళ విషయంలో సంజయ్..

సాధారణంగా ఆడవాళ్ళ విషయంలో సంజయ్ దత్‌కి కాస్త చెడ్డ పేరు ఉంది. బట్ నమ్రత మాత్రం అందుకు భిన్నంగా ఆడవాళ్ళ పట్ల సంజయ్ ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో లేడీ ఆర్టిస్టుల పట్ల సంజయ్ దత్ వ్యవహరించే తీరు గురించి నమ్రత గొప్పగా చెప్పుకొచ్చింది.

 ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో లేడీ ఆర్టిస్టులకు

ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో లేడీ ఆర్టిస్టులకు

సంజయ్ దత్ తనతో షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరి విషయంలో జాగత్త పడుతుంటాడని, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకు సెక్యూరిటీగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటాడని నమ్రత పేర్కొంది. ముఖ్యంగా ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో యూనిట్‌లో ఉన్న ఆడవారందరికి సంజయ్ దత్ ఒక గార్డ్‌గా వ్యవహరించే వాడని నమ్రత చెప్పుకొచ్చింది.

ఎంతో కంఫర్ట్.. మహేష్‌తో ప్రేమ గురించి

ఎంతో కంఫర్ట్.. మహేష్‌తో ప్రేమ గురించి

సంజయ్ దత్ లాంటి హీరోతో పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పిన నమ్రత.. తాను మహేష్ బాబుతో ప్రేమలో పడిన విషయాన్ని మొదట ఆయనతోనే షేర్ చేసుకున్నానని చెప్పింది. ఇండస్ట్రీలో తాను వర్క్ చేసిన వారందరిలో సంజయ్ దత్ చాలా ప్రత్యేకమని నమ్రత తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X