హాట్ టాపిక్: మహేష్ భార్య నమ్రత చేతిపై టాటూ (ఫోటోస్)
హైదరాబాద్: ఈ మధ్య సినిమా సెల్రబిటీలు తాము బాగా ఇష్టపడే వారి పేర్లను టాటూగా శరీరంపై వేయించుకోవడం ట్రెండుగా మారింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా ఈ సంస్కృతి పాకింది. తాము ప్రేమించే వారిపై తమకు ఎంత ప్రేమ ఉందో....ఎప్పటికీ చెరిగి పోని టాటూ రూపంలో వ్యక్త పరుస్తున్నారు.
ఇలా టాటూలు వేయించుకున్న వారి లిస్టులో మహేష్ బాబు భార్య నమ్రత కూడా చేరి పోయింది. తన భర్త మహేష్ బాబు, కొడుకు గౌతం, కూతురు సితార పేర్లను తన కుడి చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. దేవ నాగరి స్టైల్ ఫాంటు డిజైన్‌తో ఆమె చేతిపై ఈ టాటూ దర్శనమిస్తోంది.
ఇటీవల 'ఆగడు' ఆడియో వేడుకకు హాజరైన నమ్రత.....ఇలా టాటూతో కనిపించారు. దీంతో ఈ విషయం మహేష్ బాబు ఫ్యాన్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. భర్త, పిల్లలపై తనకు ఉన్న ప్రేమను ఇలా టాటూ రూపంలో బయట పెట్టింది నమ్రత. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చ....మహేష్ బాబు ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత బలంగా ఉన్నాయో.
మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

నమ్రత చేతిపై టాటూ
నమ్రత చేతిపై ఉన్న టాటూను ఇక్కడ చిత్రంలో చూడొచ్చు.

మహేష్ బాబు, నమ్రత వివాహం
పెద్దలను ఎదురించి చేసుకునే ప్రేమ వివాహం కావడంతో మహేష్ బాబు, నమ్రత వివాహం ముంబైలో నిరాడంబరంగా జరిగింది.

పెళ్లికి ముందే డేటింగ్
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసారు.

అన్యోన్యమైన దాంపత్యం
టాలీవుడ్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీరి చూటముచ్చటైన కుటుంబం.


Click it and Unblock the Notifications











