బాలీవుడ్ సూపర్ స్టార్ భార్యతో నమ్రత లంచ్ మీటింగ్.. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒక లంచ్ మీటింగ్ కోసం కలిశారు. ఈ విషయాన్నే నమ్రత తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే వీరిద్దరి లంచ్ మీటింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

లంచ్ కోసం

లంచ్ కోసం


సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వచ్చిన నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై పోయింది. అయినా సరే బాలీవుడ్ ప్రముఖులతో మాత్రం ఆమె టచ్ లోనే ఉంటూ ఉంటారు. ఈ విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడవుతుంది. తాజాగా ఆమె బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ గా భావించే షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ను లంచ్ కోసం కలిశారు.

 సరదా క్షణాలు

సరదా క్షణాలు


అంతేకాదు ఈ విషయాన్ని నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గౌరీ ఖాన్ తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన నమ్రత అనుకోని ఇప్పుడు గౌరీ ఖాన్ ఇంట్లో ఉన్నాను, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం, లంచ్ పూర్తయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాం, చాలా గొప్ప జ్ఞాపకాలు చాలా సరదా క్షణాలు మిగిలాయి, గౌరీ మీరు ఎప్పటిలాగే ప్రకాశిస్తూ ఉండండి అంటూ నమ్రత రాసుకొచ్చింది. గౌరీ ఖాన్ హైదరాబాద్ రావడంతో వీరు కలిశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

అన్నీ తానై

అన్నీ తానై


ఒకప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుతో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి అయిన తర్వాత నుంచి సినిమాలు చేయడం ఆపివేసిన ఆమె తన భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఆయనకు ఎంతగానో సపోర్ట్ గా ఉంటుంది. మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు బిజీ షెడ్యూల్ వల్ల వాటిని పట్టించుకోకపోయినా నమ్రత మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తూ ఉంటుంది.

 సహ నిర్మాణ సంస్థగా

సహ నిర్మాణ సంస్థగా


మహేష్ బాబు చేస్తున్న అన్ని బిజినెస్ లు దాదాపు నమ్రత చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆయన తన సొంత ప్రొడక్షన్ GMB ఎంటర్ టైన్ మెంట్ లో నిర్మించే సినిమాలను కూడా ఆమె పర్యవేక్షిస్తూ ఉంటారు. దాదాపుగా మహేష్ చేస్తున్న అన్ని సినిమాలకు ఈ సంస్థ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. అందుకే మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా సెట్స్ కి వెళుతూ ఉంటారు.

 ప్రత్యేక కారణాల రీత్యా ?

ప్రత్యేక కారణాల రీత్యా ?


అయితే నమ్రతా శిరోద్కర్ గౌరీ ఖాన్ ఏదైనా ప్రత్యేక కారణాల రీత్యా కలిశారా లేక సాధారణ కలయికలలో భాగమేనా అనేదానిమీద క్లారిటీ లేదు. పాత స్నేహితులు కావడంతో ఇలా కలిసి ఉండవచ్చు అని అంటున్నారు. గతంలో కూడా గౌరీ ఖాన్ బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు నమ్రతలను కలిసిన ఫోటోలు వైరల్ గా మారాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వారు ఇలా కలిశారు అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X