twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇపుడు నమ్రతను ఆడిపోసుకుని ఏం లాభం?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రంపై గతంలో ఏ తెలుగు సినిమాపై లేని విధంగా వ్యంగాస్త్రాలు, సెటైర్లు పేలడం కూడా సినిమాను బాగా దెబ్బతీసాయి.

    ఈ పరిస్థితి కారణం మహేష్ బాబు వెనకా ముందు చూసుకోకుండా ఇలాంటి సినిమాను ఎంచుకోవడం అని కొందరంటుంటే.... దర్శకుడు చేసిన తప్పిదాల వల్లే సినిమా ప్లాపయింది అంటూ మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్లాపవడానికి కారణం నమ్రత కూడా కారణం అంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది.

    'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాపవడానికి... నమ్రతకు సంబంధం ఏమిటనే డౌట్ మీకూ రావొచ్చు. అయితే మహేష్ బాబు తాను ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలో పూర్తి నిర్ణయం తనదే అని గతంలో చెప్పారు. కానీ ఆయన ఎంచుకునే ముందు నమ్రత అభిప్రాయం తీసుకుంటారట. బ్రహ్మోత్సవం విషయంలోనూ మహేష్ అలానే చేసారని, ఫెయిల్యూర్ ను అంచనా వేయడంలో మహేష్ బాబుతో పాటు ఆయన అర్దాంగిగా నమ్రత పాత్ర కూడా ఉందనేది కొందరి వాదన.

    Namrata Shirodkar Hand in Brahmotsavam

    గతంలో శ్రీమంతుడు సినిమా విషయంలో మహేష్ బాబు పర్ ఫెక్ట్ డెషిషన్ తీసుకున్నారు. ఆ కథ ఎంపిక విషయంలో నమ్రత హ్యాండ్ కూడా ఉందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శ్రీమంతుడు సినిమా విషయంలో నిర్మాణ బాధ్యతలల్లో నమ్రత కూడా పాలు పంచుకోవడంతో పాటు, పబ్లిసిటీ వ్యవహారాలకు సంబంధించిన పర్యవేక్షణ కూడా చేసారు. ఆ సినిమాలో సాలిడ్ కంటెంట్ ఉండటంతో పాటు అన్ని వ్యవహారాలు పక్కాగా జరుగడంతో బాహుబలి తర్వాత ఇండస్ట్రీలోనే అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది.

    అయితే 'బ్రహ్మోత్సవం' విషయంలో అన్ని పక్కాగా సాగినా.... కంటెంటులోనే తేడా వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత నెగెటివ్ టాక్ విస్తరించినా.... సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం జరిగినా నమ్రతతో పాటు పివిపి మౌనంగా ఉండిపోయారు. నిర్మాణం, పబ్లిసిటీ వ్యవహారాలు మొదటి నుండి పర్యవేక్షిస్తుంది వీరిద్దరే కాబట్టి.... వీరు తగిన చర్యలు తీసుకుంటే డ్యామేజీ కొంతమేర అయినా తగ్గేదని, వీరి మౌనం కారణంగా సినిమాకు తీరని నష్టం వాటిల్లిందని అంటున్నారు. అయినా ఇపుడు నమ్రతను ఆడిపోసుకుని ఏం లాభం...జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయిందనేది మరికొందరి వాదన.

    English summary
    ‘Brahmotsavam film opened to piteous reviews and disgraceful public talk. So, this is right challenge for Namrata to rectify the damage. Instead of controlling the grievous talk spreading across Telugu population, Namrata and PVP team stood numb.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X